
ఇస్రో పిలుస్తోంది... వెళ్దాం రండి..!
మదనపల్లె సిటీ: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుందాం రండి. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీ వల ఇస్రో వంద ప్రయోగాలను పూర్తి చేసుకుంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది.
23 వరకు గడువు:
విద్యార్థులు మార్చి 23వ తేదీలోగా ఠీఠీఠీ.జీటటౌ.జౌఠి.జీ ుఽ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడబోత అనంతరం ఏప్రిల్7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 18 నుంచి విద్యార్థుఽలను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–25 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 31న ముగింపు కార్యక్రమం ఉంటుంది.
7 కేంద్రాల్లో నిర్వహణ: ఇస్రో ఈ కార్యక్రమాన్ని ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట ( ఏపీ), బెంగళూరు (కర్నాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్( మేఘాలయ).
ఎవరు అర్హులు: 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8 లో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తా రు. స్పేస్, సైన్సు క్లబ్‌లలో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్‌సీసీ, స్కౌట్స్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, పల్లె ప్రాంతాల వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు.
ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు..
టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ప్రతి మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థి కూడా ఉన్నత స్థాయిని అధిరోహించడానికి కల్పిస్తున్న అవకాశాల్లో ఇది ఒకటి. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకునేలా సైన్సు టీచర్లు కృషి చేయాలి. ఆసక్తి ఉన్న వారు మార్చి 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. –మార్ల ఓబుల్‌రెడ్డి, జిల్లా సైన్సు అధికారి
అన్నీ ఉచితంగానే...
ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో కేటాయించిన రోజులలో ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్‌కు సంబంధించిన అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం
ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి
జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రతిభా అన్వేషణ్ పరీక్షలు రాయించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని విద్యార్థి దశలోనే పొందితే కచ్చితంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదుగుతారు. ప్రధానోపాధ్యాయులు దీనిని బాధ్యతగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించాలి. – సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అఽధికారి

ఇస్రో పిలుస్తోంది... వెళ్దాం రండి..!
Comments
Please login to add a commentAdd a comment