మదనపల్లె : మండలంలోని పలు ప్రాంతాల్లో ఎకై ్సజ్ అధికారులు శనివారం నిర్వహించిన దాడుల్లో 10 లీటర్ల నాటుసారాతోపాటుగా 31 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భీమలింగ తెలిపారు. శనివారం వివిధ కేసుల్లో పట్టుబడిన నిందితులను అరెస్ట్ చూపారు. ఈ సందర్భంగా సీఐ భీమలింగ మాట్లాడుతూ సీటీఎం దళితవాడలోని ఓ ఇంట్లో నాటుసారా విక్రయిస్తున్న యర్రబల్లి బుజ్జి(42), అదే గ్రామానికి చెందిన పెద్దింటి లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే కేసులో నిందితులకు నాటుసారా సరఫరా చేసిన వాల్మీకిపురం మండలం దిగువ మేకలవారిపల్లెకు చెందిన ఎం.మల్లికార్జున(27)ను మూడో నిందితుడిగా కేసులో చేర్చామన్నారు. సారా స్వాధీనం చేసుకున్న కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు పంపామన్నారు. అనంతరం చీకలబైలు గ్రామంలో నిర్వహించిన దాడుల్లో జె.నాగమ్మ వద్ద కర్ణాటక 31 టెట్రాప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఎస్‌ఐలు డార్కస్, జబీవుల్లా, కానిస్టేబుళ్లు నాగరాజు, మణి, మధు, శివరాణి, గంగా, మహేశ్వరి, రేఖలు పాల్గొన్నారు.