
ఆర్టీసీ కండక్టర్‌కు కలాం కార్మిక రత్న అవార్డు
రాజంపేట : ఏపీఎస్‌ఆర్‌టీ కండక్టర్ సీఎస్ మణ్యం కలాం కార్మికరత్న అవార్డును దక్కించుకున్నారు. ఇంటర్నేషనల్ యునైటెడ్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా తమిళనాడులోని మధురైలో జేపీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయ్యప్పన్, శ్రీలంక ప్రభుత్వ యువజన సర్వీసుల కమిషనర్ తదితరుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్లు కండక్టర్ తెలిపారు.
అనారోగ్యంతో హోంగార్డు మృతి
సుండుపల్లె : మండలంలోని అగ్రహారంలో నివాసం ఉంటున్న గూటి శివకుమార్(36) అనే హోం గార్డు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి భార్య నవ్యసుధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రాజంపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో శివకుమార్ హోంగార్డు( 498)గా విధులు నిర్వహించే వాడు. అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజుల నుంచి సెలవులో ఉన్నాడు. హోంగార్డు శివకుమార్ మృతిపట్ల అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే సుండుపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులు, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ అమరనాథరెడ్డి, రాజంపేట సబ్ డివిజన్ హోంగార్డు ఇన్‌చార్జి లక్ష్మీరెడ్డి, పోలీసు సిబ్బంది, తిమ్మసముద్రం గ్రామ పంచాయతీ కోడూరువాండ్లపల్లి గ్రామంలో స్వగృహంలో ఉన్న హోంగార్డు మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బేకరీని తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
రామసముద్రం : రామసముద్రంలోని ఓ బేకరీని శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం హనీ కేక్ తిని ఐదుగురు చిన్నా రులు అస్వస్థతకు గురైన సంఘటన తెలిసిందే. ఈ మేరకు అన్నమయ్య జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షమీం బాషా తన సిబ్బందితో తనిఖీ నిర్వహించారు. బేకరీ లోని పలు రకాల తినుబండారాలను పరిశీలించారు. పదార్థాల తయారీకి సంబంధించి పరికరాలు, వస్తువుల నాణ్యతను తెలుసుకున్నారు. ఇందులో కొన్ని పదార్థాలను ల్యాబ్ పరిశీలన నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకెళ్లారు.
పోలీసుల దాడిలో గాయపడిన వ్యక్తికి తీవ్ర అస్వస్థత
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : పెండ్లిమర్రి పోలీసు స్టేషన్‌లో గురువారం రాత్రి ఎస్‌ఐ దాడి చేయడంతో నాగాయపల్లె గ్రామానికి చెందిన రామఓబుళరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. లాఠీ దెబ్బలు తిని గాయపడిన రామ ఓబుళరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎక్స్‌రే తీయగా పక్కటెముకలు వాపు వచ్చి దెబ్బతిన్నట్లు బాధితుడు తెలిపారు. రిమ్స్ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసిన కేసులో రాజీ ప్రయత్నాల కోసం ఎస్‌ఐ టీడీపీ మండల నాయకులను ఆశ్రయించాడు. టీడీపీ నాయకులు రంగంలోకి దిగి చెన్నూరులో రామఓబుళరెడ్డి బంధువు ఇంటికి వెళ్లి రాజీ ప్రయత్నాల కోసం మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆర్టీసీ కండక్టర్‌కు కలాం కార్మిక రత్న అవార్డు

ఆర్టీసీ కండక్టర్‌కు కలాం కార్మిక రత్న అవార్డు