
గాలి, వాన బీభత్సం
కలికిరి: గాలి, వాన సృష్టించిన బీఽభత్సంతో రైతులక నష్టం వాటిల్లింది. ఆదివారం మండల పరిధిలో పెనుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గాలుల ధాటికి మామిడికాయలు నేలరాలగా, టమాట పంట దెబ్బతింది. బొప్పాయి తోటల్లో చెట్లు విరిగిపడ్డాయి. మరి కొన్ని చోట్ల వరి పంట నేలకొరిగింది. అసలే ధరలు లేక ఇబ్బంది పడుతున్న టమాట రైతులు పంట దెబ్బతినడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు
నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పీలేరు రూరల్: మండలంలో గాలి, వాన భీభత్సంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆదివారం పీలేరు పట్టణంలోని బోయపాళెం వీధిలో, నగిరిలో, వరంపాటివారిపల్లెలో విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. స్పందించిన ట్రాన్స్‌కో ఏఈ ఖాదర్ ఇలాహి మరమ్మతులు చేయించి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. పీలేరు పట్టణం మదనపల్లె మార్గంలోని రైల్వే స్టేషన్ వద్ద ఓ చెట్టు విరిగి జాతీయ రహదారిపై పడింది.

గాలి, వాన బీభత్సం