
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.దశమి ప.1.10 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఆశ్లేçష పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.1.02 నుండి 2.32 వరకు, దుర్ముహూర్తం: ప.12.12 నుండి 12.59 వరకు తదుపరి ప.2.33 నుండి 3.21 వరకుు,
అమృతఘడియలు: తె.5.16 నుండి 7.01 వరకు (తెల్లవారితే మంగళవారం);
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
సూర్యోదయం: 5.55,
సూర్యాస్తమయం: 5.41.
మేషం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
వృషభం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మిథునం: ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. పనుల్లో తొందరపాటు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తప్పవు.
కర్కాటకం: పనుల్లో ముందడుగు వేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
సింహం: రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.
కన్య: పనుల్లో మరింత పురోగతి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తిలాభం. వాహనసౌఖ్యం. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి.
వృశ్చికం: సన్నిహితుల నుంచి సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.
ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదాపడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. వాహనయోగం.కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
మీనం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
Comments
Please login to add a commentAdd a comment