టేకులపల్లిలో మిర్చి కొనుగోళ్లు
టేకులపల్లి: ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో టేకులపల్లి సబ్ యార్డులో సోమవారం మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి జాల నరేందర్, ఇల్లెందు మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి వి.సుచిత్ర మాట్లాడుతూ టేకులపల్లి మండలంలో మిర్చి పంటకు ఆదరణ ఉందన్నారు. ఇక్కడి రైతులు ఖమ్మం, మహబూబాబాద్ తదితర పట్టణాలకు తీసుకెళ్లి మిర్చి విక్రయిస్తే సుమారు రూ.3 వేల వరకు ఖర్చవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా టేకులపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. తొలిరోజు క్వింటాల్‌కు జెండా పాట రూ.13,300గా నమోదైంది. అత్యల్పంగా రూ.12,100, మోడల్ రేటు రూ.12,500, తాలు మిర్చి ధర రూ. 6500గా నమోదయ్యాయి. తొలిరోజు 145 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. అనంతరం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అధికారులు నరేష్‌కుమార్, వి.శ్రీనివాస్‌రావు, జి.రంజిత్, సీహెచ్ లక్ష్మయ్య, కార్తీక్, మునీర్, శ్రీనివాస్‌రావు, మోహన్‌రావు, హరికృష్ణ, మధు, విజయ, లక్ష్మి, ట్రేడర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment