ఉపవాసంతో ఆకలి విలువ తెలుస్తుంది..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఉపవాసాల ద్వారా ఆకలి విలువ తెలుసుకుని పేదవారిని ఆదుకునే గుణం అలవడుతుందని జేఐహెచ్ కేంద్ర కమిటీ సభ్యుడు మౌలానా హమీద్ మహ్మద్‌ఖాన్, ముఫ్తీ మౌలానా ఇస్మాయిల్ అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ రుద్రంపూర్, రామవరం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రామవరంలోని జమా మసీద్‌లో ఇస్తేఖ్‌బాల్–ఏ–రంజాన్(రంజాన్ మాసానికి స్వాగతం) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం పెంచి, మానవులందరూ కలిసిమెలిసి జీవించేలా అల్లా దీవించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ యజ్ఞాని, షేక్ అబ్దుల్ బాసిత్, అబ్దల్ సత్తార్, బాబా, అరీఫ్, హఫజుద్దీన్, ఖమర్, జాకీర్, ఆలం, షమీం, పర్వీన్, నష్రా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment