కంపగూడెం పాఠశాలకు అవార్డు
ములకలపల్లి: మండలంలోని కంపగూడెం ప్రభుత్వ పాఠశాలకు బాలమేళాలో అవార్డు లభించింది. బా లమేళాలో భాగంగా ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (లిటరసీ, న్యూమరసీ) అంశాల్లో కంపగూడెం పాఠశాల గత నెలలో ఎంపికై ంది. మండలంలోని 48 పాఠశాలలకు గాను కంపగూడెం పాఠశాలను బెస్ట్ స్కూల్‌గా విద్యాశాఖాధికారులు ఎంపిక చేశారు. మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమ్మేళనంలో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, డీఈఓ వెంకటేశ్వరాచారి, హెచ్‌ఎం సుజాత, ఉపాధ్యాయురాలు కీసరి జయసుధను సత్కరించి, మెమెంటో అందజేశారు.
ఎంఈఓకు ప్రశంస
దమ్మపేట: విధి నిర్వహణలో ఉత్తమంగా వ్యవహరించిన స్థానిక ఎంఈఓ కీసర లక్ష్మిని మంగళవారం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అభినందించారు. బాలమేళా కార్యక్రమ నిర్వహణతో పాటుగా విధులను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వహించిన దమ్మపేట ఎంఈఓ లక్ష్మి.. జిల్లాస్థాయిలో ఉత్తమ ఎంఈఓగా ఎంపికయ్యారు. కొత్తగూడెంలో నిర్వహించిన జిల్లాస్థాయి బాలమేళాలో మండలంలోని జగ్గారం ప్రాథమిక పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో ఎంఈఓ లక్ష్మితో పాటుగా జగ్గారం పాఠశాల హెచ్‌ఎం పుష్పకుమారిని కలెక్టర్ సత్కరించారు. ప్రశంసాపత్రాలను అందజేశారు.
కంపగూడెం పాఠశాలకు అవార్డు
Comments
Please login to add a commentAdd a comment