పట్టు రైతుల విజ్ఞాన యాత్ర
ఖమ్మంవ్యవసాయం: పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన విజ్ఞాన యాత్రలో ఉమ్మడి జిల్లాకు చెందిన 50 మంది పట్టు రైతులు పాల్గొన్నారు. రైతుల బృందం శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింటకుంటలోని మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపకం, రేరింగ్ షెడ్లను పరిశీలించింది. ఉమ్మడి జిల్లా పట్టు పరిశ్రమ ఉపంచాలకులు ముత్యాల పర్యవేక్షణలో రైతులు ఈ యాత్రలో పాల్గొనగా, శాస్త్రవేత్తలు వినోద్‌కుమార్, రాఘవేంద్ర వారికి అవగాహన కల్పించారు. ముత్యాలు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పట్టు పరిశ్రమ ఏర్పాటుకు వనరులు ఉన్నాయని, రైతులు ముందుకు రావాలన్నారు. సహా య పట్టు పరిశ్రమ అధికారి దేవరాజు పాల్గొన్నారు.