ములకలపల్లి: మండల పరిధిలోని కమలాపురం ఆశ్రమ హాస్టల్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. గదిలో ఉన్న పాత పరుపులు, క్రీడా వస్తువులు దగ్ధమయ్యాయి. స్థానికులతో సమాచారంతో కొత్తగూడెం నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆదివారం కావడంతో విద్యార్థులందరూ హాస్టల్‌లోనే ఉన్నారు. అయితే ప్రమాద సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్టడీ అవర్స్‌లో ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. కాగా రూ. 30 వేల నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదా ఘటనపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆరా తీశారు.