●బాధితుడి గుర్తింపు (సాయంత్రం 6–15నుంచి రాత్రి 6–57గంటల
తొలి ప్రయత్నం విఫలం కావడంతో నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్లేలా క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిండం మొదలెట్టారు. అడ్డుగా వచ్చిన బీమ్‌లను కట్టర్ల సాయంతో కత్తిరించారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్ లోపలి భాగం కొంత మేర కనిపించింది. ఆ ప్రాంతంలో ఒక చిన్న వెలుతురు కనిపించడంతో తీక్షణంగా పరీక్షించగా అది మొబైల్ ఫోన్‌గా తేలింది. ఆ మొబైల్ ఫోన్ లంచ్ బాక్స్ సంచిలో ఉన్నట్టు గుర్తించారు. లోపల ఎవరైనా ఉన్నారా అని రెస్క్యూ టీమ్ సభ్యులు పదే పదే అడగగా శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు నుంచి బదులు వచ్చింది.