పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయ కమిటీలో కేశవాపురం, జగన్నాథపురం గ్రామస్తులకు అవకాశం కల్పించాలని, అప్పటివరకు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇద్దరు యువకులు ఆలయం ఎదుట ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గంధం నర్సింహారావు, బాదర్ల నాగేశ్వరరావు, గంధం సతీష్, గంధం రామయ్య, కొండం పుల్లయ్య, లింగయ్య, లక్ష్మి, అల్లం స్వరూప, రాములు, భూలక్ష్మి, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎండోమెంట్ కమిషనర్ నుంచి మంగళవారం సర్క్యులర్ రావడంతో బుధవారం నూతన కమిటీ సభ్యులతో మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేశామని, ప్రమాణ స్వీకారానికి ఇంకా మూహుర్తం ఖరారు చేయలేదని ఈఓ రజనీకుమారి తెలిపారు.