భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నిద్ర లేకుండా రెండు రోజులుగా శ్రమిస్తున్నారు. కానీ కార్మికుల మృతికి బాధ్యత వహించాల్సిన ఆ ఇంటి యజమానులైన భార్యాభర్తల జాడ మాత్రం లేదు. బుధవారం ఘటన జరిగిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్టు ప్రచారం జరిగినా, పోలీసులు మాత్రం వారు లొంగిపోయారా.. అరెస్ట్ చేశారా? అనే వివరాలు వెల్లడించలేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఇష్టారీతిగా నిర్మాణాలు సాగించిన వారిపై కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.