
న్యూఢిల్లీ: ఆటొమొబైల్ తయారీ దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ నేడు ఇండియాలో సరికొత్త 2021 బీఎండబ్ల్యూ340ఐ మోడల్‌ను విడుదల చేసింది. 3 సిరీస్‌లోని మోడలైన ఈ కారు ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.62.90 లక్షలుగా నిర్ణయించారు. తక్కువ సంఖ్యలోనే ఈ కార్లను విక్రయించాలని బీఎండబ్ల్యూ నిర్ణయించింది. బీఎండబ్ల్యూ 340ఐ ట్విన్‌పవర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 387 హెచ్‌పి శక్తిని, 500ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ కారులో 3.0లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. కేవలం 4.4 సెకన్లలో 0-100 కిలోమీటర్లు చేరుకుంటుంది. దీనిలో గరిష్ట వేగం 250 కిలోమీటర్లగా ఉంది.
ఈ కారులో 8స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ను అమర్చారు. దీనిలో ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ మోడ్ లు ఉన్నాయి. ఈ సెడాన్‌లో ఎం-స్పెసిఫిక్ చట్రం ట్యూనింగ్, ఎం స్పోర్ట్ రియర్ డిఫరెన్షియల్, ఎం-ట్యూన్డ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్, వేరియబుల్ స్పోర్ట్ స్టీరింగ్, బిఎమ్‌డబ్ల్యూ పెర్ఫార్మెన్స్ కంట్రోల్ మరియు ఎం స్పోర్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నాయి. ఇక కారులో ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ డాంపర్స్‌తో కూడిన ఎం సస్పెన్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. బీఎండబ్ల్యూ ఎం ఎక్స్‌డ్రైవ్ ఫీచర్ ఉంది. 18 అంగుళాలా వీల్స్‌ను అమర్చారు. ఇక ఇంటీరియర్‌లో 3సిరీస్ సెడాన్‌లో ఉన్న ఫీచర్లు ఉన్నాయి. సన్‌రూఫ్, 12.3 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ ప్యానల్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ కారు అందాన్ని మరింత పెంచాయి. 3జోన్ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్ వ్యవస్థ, యాంబియంట్ లైటింగ్ వంటివి అదనపు ఆకర్షణలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌ను స్వీకరిస్తోంది.
చదవండి: