న్యూఢిల్లీ: కమ్యూనికేషన్స్ రంగ కంపెనీ వన్‌వెబ్ మరోసారి ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం అవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో (ఇస్రో) కలిసి 36 ఉపగ్రహాలను మార్చి 26న ప్రయోగించనుంది. భూమికి తక్కువ కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్) వీటిని పంపుతారు. జూలై–ఆగస్ట్ నాటికి భారత్‌లో సేవలను అందించేందుకు సిద్ధమని వన్‌వెబ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఫిబ్రవరిలో వెల్లడించారు.
భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి కంపెనీకి లైసెన్స్ దక్కింది. అయితే ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయించాల్సి ఉంది. ‘శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవి నింగిలోకి దూసుకెళ్లనున్నాయి. వన్‌వెబ్ ఇప్పటికే 17సార్లు ఉపగ్రహాలను పంపింది. ఈ ఏడాది మూడవ పర్యాయం ప్రయోగిస్తోంది. మొదటి తరం లో ఎర్త్ ఆరిŠబ్‌ట్ (లియో) కూటమిని పూర్తి చేసి 2023లో కంపెనీ అంతర్జాతీయంగా కవరేజీని ప్రారంభించేందుకు ఈ ప్రయోగం వీలు కల్పిస్తుంది. కంపెనీ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి’ అని వన్‌వెబ్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment