ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!! టెక్నాలజీ ప్రియుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొత్త టూల్స్. ప్రియురాలికిచ్చే ప్రేమ లేఖల దగ్గర నుంచి..యాప్స్ డిజైన్ చేసేందుకు ఉపయోగించే కోడింగ్ వరకు ఇలా అన్నీ అవసరాల కోసం ఏఐ టూల్స్ చాట్‌జీపీటీ, బార్డ్‌లనే ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ కొత్త ఏఐ టూల్స్ వల్ల ఎంత లాభం ఉందో మానవాళికి ముప్పు అదే స్థాయిలో ఉందని ట్విటర్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ వంటి దిగ్గజ సీఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ సర్వేలో సైతం ప్రముఖ కంపెనీల సీఈవోలు ఇదే అంశాన్నీ లేవనెత్తారు.
ఈ వారంలో అమెరికన్ యేల్ యూనివర్సిటీ ‘యేలో సీఈవో సమ్మిట్’ నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రముఖ మీడియా దిగ్గజం సీఎన్‌ఎన్ ‘ఏఐ’పై సర్వే చేయగా.. అందులో 42 శాతం మంది సీఈవోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల స్థానాల్ని ఆక్రమించేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
యేలే సీఈవో సమ్మిట్‌లో 42 శాతం సీఈవోలతో పాటు ప్రముఖ వ్యాపార వేత్తలు ‘రానున్న 5 నుంచి 10 ఏళ్లలో మనుషుల్ని నాశనం చేసే సామర్ధ్యం కృత్తిమ మేధకు ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు. వాల్‌మార్ట్, కోకా-కోలా, జిరాక్స్, జూమ్‌తో పాటు ఇతర వ్యాపార సంస్థల్లో కార్యకాలపాలు నిర్వహించే 119 మంది సీఈవోలు పాల్గొన్నారని నివేదిక పేర్కొంది. ఈ ఫలితాలపై యేల్ ప్రొఫెసర్ జెఫ్రీ సోన్నెన్‌ఫెల్డ్ ఈ సర్వే చీకటిగా, భయంగా ఉందంటూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
సర్వే ప్రకారం.. 34 శాతం మంది సీఈవోలు ఏఐ టెక్నాలజీతో రానున్న 10 ఏళ్లలో మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లితున్నట్లు చెప్పారు. 8 శాతం మంది ఇప్పటి నుంచి మరో ఐదేళ్లలో కృత్తిమ మేధతో మనుషులుకు వినాశనం తప్పదన్నారు. సుమారు 58 శాతం మంది సీఈవోలు మనుషుల మేధస్సును ఏఐ టెక్నాలజీ ఏం చేయలేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
గతంలో టెక్ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్ మన్ కృత్తిమ మేధ వల్ల జరిగే అనార్ధాల గురించి హెచ్చరించారు. కొన్ని వారాల క్రితం డజన్ల మంది ఏఐ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ఏఐతో ‘వినాశానమే’నని సూచించారు. వారిలో శామ్ ఆల్ట్‌మన్, ‘గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ’ జెఫ్రీ హింటన్, గూగుల్,మైక్రోసాఫ్ట్ ఎక్జిగ్యూటీవ్‌లు ఉన్నారు. అయితే, సమాజం ఏఐ నుంచి వచ్చే ప్రమాదాల్ని తిప్పికొట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
మహమ్మారి, న్యూక్లియర్ వార్ వంటి ఇతర సామాజిక ప్రమాదాల్ని తగ్గించే ఎంత ప్రాదాన్యం ఇచ్చామో.. AIతో తలెత్తే ప్రమాదాన్ని తగ్గించేందుకు ఓ ప్రాధాన్యతగా తీసుకోవాలని ఏఐ పరిశ్రమ వర్గాల ప్రతినిధులు పిలుపు నిచ్చారని నివేదిక హైలెట్ చేసింది.
చదవండి : ‘AI’ టూల్స్ వినియోగం..ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్!
Comments
Please login to add a commentAdd a comment