న్యూఢిల్లీ: ఆగ్రో కెమికల్స్ తయారీ కంపెనీ ‘ధర్మజ్ కార్ప్ గార్డ్’ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెల 28 నుంచి మొదలు కానుంది. 30వ తేదీన ఇష్యూ ముగుస్తుంలది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.216–237ను ప్రకటించింది. గరిష్ట ధర ప్రకారం చూస్తే ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.251 కోట్ల వరకు సమీకరించనుంది. రూ.216 కోట్ల విలువ చేసే షేర్లను తాజా జారీ ద్వారా, మరో 14.83 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనుంది.
ఐపీవో రూపంలో కంపెనీకి సమకూరే రూ.216 కోట్లను గుజరాత్‌లోని బరూచ్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు వినియోగించనుంది. అలాగే, మూలధన అవసరాలకు, రుణాలను చెల్లించేందుకు ఉపయోగించుకోనుంది. పురుగు ముందులు, శిలీంద్ర సంహారిణి రసాయనాలు, సూక్ష్మ ఎరువులు తదితర ఉత్పత్తులను ధర్మజ్ తయారు చేస్తోంది. 25కు పైగా దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
చదవండి: PM Kisan New Rules: పీఎం కిసాన్‌లో కొత్త రూల్స్.. వాళ్లంతా అనర్హులు, ఈ పథకం వర్తించదు!
Comments
Please login to add a commentAdd a comment