chemical agricultural
-
ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!
పెట్రోలియం, జెమ్‌స్టోన్ (రత్నాలు), చక్కెర, ఆగ్రోకెమికల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ పాత్ర అంతర్జాతీయంగా బలోపేతం అవుతోంది. గడిచిన ఐదేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ రంగాల నుంచి భారత్ ఎగుమతుల వాటా పెరుగుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 నుంచి 2023 మధ్య కాలంలో వీటితోపాటు ఎలక్ట్రికల్ గూడ్స్, న్యూమాటిక్ టైర్లు, ట్యాప్‌లు, వాల్వ్‌లు, సెమీకండక్టర్ పరికరాల ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం..2023లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 85 బిలియన్ డాలర్ల(రూ.7.09 లక్షల కోట్లు)కు పెరిగాయి. ఈ రంగంలో అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి 6.45 శాతంగా ఉంటే, 2023 నాటికి 12.59 శాతానికి పెరిగింది. 2018లో పెట్రోలియం ఉత్పత్తుల పరంగా ఐదో అతిపెద్ద దేశంగా ఉండగా, 2023 నాటికి మూడో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది.విలువైన రాళ్లుప్రీషియస్, సెమీ ప్రీషియష్ (విలువైన రాళ్లు) స్టోన్స్ ఎగుమతుల పరంగా 2018 నాటికి భారత్ వాటా 16.27 శాతం కాగా, 2023 చివరికి 36.53 శాతానికి పెరిగింది. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ నంబర్1 స్థానానికి చేరింది. 2023లో 1.52 బిలియన్ డాలర్ల విలువైన తర్నాలను భారత్ ఎగుమతి చేసింది. 2018లో ఎగుమతులు కేవలం 0.26 బిలియన్ డాలర్లుగానే (అంతర్జాతీయంగా రెండో స్థానం) ఉన్నాయి.చక్కెర ఎగుమతులుచెరకు లేదా చక్కెర ఎగుమతుల పరంగా అంతర్జాతీయంగా భారత్ వాటా 2018 నాటికి ఉన్న 4.17 శాతం నుంచి 2023లో 12.21 శాతానికి చేరింది. చక్కెర ఎగుమతుల్లో భారత్ అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ఆగ్రోకెమికల్, పురుగు మందులుఆగ్రోకెమికల్, పురుగు మందుల ఉత్పత్తుల ఎగుమతులతో అంతర్జాతీయంగా భారత్ వాటా 8.52 శాతం నుంచి 10.85 శాతానికి పెరిగింది. 2023 చివరికి ఎగుమతులు 4.32 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలు భారత్‌కు కలిసొస్తున్నాయి. ఈ విభాగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. ఇదీ చదవండి: అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?రబ్బర్ టైర్ల ఎగుమతులురబ్బర్ న్యూమాటిక్ టైర్ల ఎగుమతులు 2018లో 1.82 బిలియన్ డాలర్లుగా ఉంటే 2023 చివరికి 2.66 బిలియన్ డారల్లకు పెరిగాయి. అంతర్జాతీయంగా భారత్ వాటా 2.34 శాతం నుంచి 3.31 శాతానికి చేరింది.సెమీకండక్టర్లుసెమీకండక్టర్, ఫొటోసెన్సిటివ్ పరికరాల ఎగుమతులు 2018లో కేవలం 0.16 బిలియన్ డాలర్లుగానే ఉండగా, 2023 నాటికి 1.91 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
నాలుగేళ్లలో రెట్టింపు ఎగుమతులు
న్యూఢిల్లీ: పరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులు, అవకాశాలు కల్పిస్తే భారత్ వ్యవసాయ రసాయన ఎగుమతులు రాబోయే నాలుగేళ్లలో రూ.80,000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఏఎఫ్‌సీఐ–ఈవై నివేదిక ఒకటి పేర్కొంది. ఇండస్ట్రీ ప్రతినిధ్య సంస్థ అగ్రో కెమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎఫ్ఐ)–ఈవై సంయుక్తంగా ‘భారత వ్యవసాయ రసాయన పరిశ్రమ: ప్రస్తానం, సవాళ్లు, ఆకాంక్షలు’ అన్న శీర్షికన ఈ నివేదిక రూపొందింది. ఏసీఎఫ్ఐ ఏడో సార్వత్రిక సమావేశం నేపథ్యంలో విడుదలైన ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...2022–23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రసాయనాల ఎగుమతుల విలువ రూ.43,223 కోట్లు.భారత్ వ్యవసాయ రసాయన ఎగుమతులు దేశీయ వినియోగం కంటే ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రసాయన పరిశ్రమల దన్నుతో భారత్ ఎగుమతులు ఇటీవలి కాలంలో ప్రశంసనీయమైన వృద్ధిని నమోదుచేసుకున్నాయి.లైసెన్సింగ్ నిబంధనలను క్రమబదీ్ధకరించడం, నిల్వ, విక్రయాల కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, బయోపెస్టిసైడ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం, కొత్త మాలిక్యులస్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, సడలించిన ఎంఆర్ఎల్ నిబంధనలతో దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడం, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్ఐ తరహాలో ఒక పథకాన్ని ఆవిష్కరించడం వంటి పలు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. వస్తు సేవల పన్నును (జీఎస్టీ) 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమల సంఘం కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగల దేశంగా భారత్ ప్రపంచ తయారీ కేంద్రంగా రూపొందాలి. ఇందుకు సంబంధించి వృద్ధి అవకాశాల అన్వేషణలో వ్యవసాయ రసాయన పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత, ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించడంలో అగ్రోకెమికల్ పరిశ్రమ పాత్ర ఎంతో కీలకం కానుంది.ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద వ్యవసాయ రసాయనాల ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, భారతదేశం ఒక వైరుధ్య పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశం గణనీయమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటికీ గణనీయమైన స్థాయిలో వ్యవసాయ రసాయనాలను దిగుమతి చేసుకుంటుంది. ప్రత్యేకించి చైనా నుంచి ఈ దిగుమతులు జరుగుతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాల్సి ఉంది. అవకాశాలుగా మార్చడానికి సకాలంలో తగిన ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటుకావాలి. ఆయా చర్యలు దేశాన్ని వ్యవసాయ రసాయనాల కోసం ప్రపంచ తయారీ ఎగుమతి కేంద్రంగా మారడానికి వీలు కలి్పస్తుంది. ఇదీ చదవండి: మొబైల్ అలర్ట్‌లతో ప్రాణాలు కాపాడేలా..భారత మార్కెట్లో వ్యవసాయ రసాయన వినియోగం (కేజీ/హెక్టార్‌కు) తక్కువగా ఉంది. నివేదికల ప్రకారం భారతదేశం హెక్టారుకు 400 గ్రాముల వ్యవసాయ రసాయనాలను మాత్రమే వినియోగిస్తోంది. ఇది ప్రపంచ సగటు 2.6 కేజీ/హెక్టార్ కంటే తక్కువగా ఉంది. -
సాగుబడి: 15 నిమిషాల్లోనే.. ఎడ్ల బండితో పిచికారీ!
కూలీల సమస్యను అధిగమించడంతోపాటు పెట్టుబడి తగ్గించుకునే ఆలోచనతో ఓ యువరైతు వినూత్న స్ప్రేయర్‌ను రూపొందించారు. ఎడ్లబండిపై పెట్టుకొని ఉపయోగించుకునేందుకు ఈ స్ప్రేయర్ అనువైనది కావటం విశేషం. అందరి మన్ననలు అందుకుంటున్న మక్దుం అలీపై ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామానికి చెందిన మక్దుం అలీ(38)కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే చదువు ఆపేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. సాగునీటి ఇబ్బందులున్నప్పటికీ.. రెండెకరాల్లో కంది, ఆముదాలు, పత్తితోపాటు మరో ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరగడం, రాబడి తగ్గుతుండడంతో ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటారు. పురుగు మందులతోపాటు కూలీల ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఆవిష్కరణ వెలుగుచూసింది. ఎడ్ల బండిపై 5 హెచ్‌పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైఫర్ మోటర్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్లతో సుమారు రూ.45 వేల వ్యయంతో అలీ దీన్ని రూపొందించారు. ఎడ్ల బండిపై కూర్చున్న రైతు బండిని తోలుకెళ్తూ ఉంటే.. బండి వెనుక వైపు బిగించిన రెండు స్ప్రేగన్లు ఏకకాలంలో పిచికారీ చేస్తాయి. అటు 20 అడుగులు, ఇటు 20 అడుగుల (దాదాపు ఆరు సాళ్ల) వరకు పురుగుల మందును ఈ యంత్రం పిచికారీ చేస్తుంది. మనిషి అవసరం లేకుండానే రెండు స్ప్రేగన్లు, రెండు డ్రమ్ముల ద్వారా 15 నిమిషాల్లోనే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తాయి. ఎడ్లబండిపై కూర్చునే వ్యక్తికి, ఎద్దులకు మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో వెనుక వైపున పురుగుమందు పిచికారీ అవుతున్నందున ఇబ్బంది ఉండదు. అలీని కలెక్టర్ ప్రశంసించడమే కాకుండా ‘ఇంటింటా ఇన్నోవేషన్’కు ఎంపిక చేశారు. టీహబ్ అధికారులూ ప్రశంసించారు. – పెరుమాండ్ల కిషోర్ కుమార్, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, ఫొటోలు: సుదర్శన్‌గౌడ్, నర్వ స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ.. రసాయనిక వ్యవసాయంలో తెగుళ్ల బెడద ఎక్కువ. పంటలపై వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్క రోజులోనే పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించొచ్చు. నేను రూపొందించిన స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ చేయొచ్చు. దీంతోపాటు నిర్దేశించిన మేరకు ఖచ్చితత్వంతో ఎరువులు వేసేలా రూ.500 ఖర్చుతో పరికరాన్ని రూపొందించాను. కూలీలు అవసరం లేకుండా రైతు ఒక్కరే ఎరువులు వేసుకోవచ్చు. శాస్త్రవేత్త కావాలన్నది నా సంకల్పం. అయితే ఆర్థిక స్థోమత లేమి కారణంగా చదువు మధ్యలోనే ఆగింది. నాకున్న ఆలోచనతో స్ప్రేగన్ తయారు చేసిన. ప్రభుత్వ ప్రోత్సహించాలని కోరుతున్నా. – మక్దుం అలీ (97038 20608), యువ రైతు, కల్వాల్, నర్వ ► గుంటూరులో చిరుధాన్య వంటకాలపై శిక్షణ.. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10–5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666 / 95538 25532కు ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు తెలిపారు. ఇవి చదవండి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు! -
పచ్చనాకు సాక్షిగా పచ్చటి తోవలో.. 'కృషిమిత్ర' గీత
‘వ్యవసాయం బాగుండాలంటే రసాయన ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడాలి’ అనే నమ్మకం బలంగా పాతుకుపోయిన గ్రామంలో సేంద్రియ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? పెద్దగా స్పందన కనిపించదు. అంగిసింగి అనే ఊళ్లో కూడా అచ్చం అలాగే జరిగింది. అయితే ‘కృషిమిత్ర’ గీత వల్ల ఆ ఊరు మారింది. పచ్చనాకు సాక్షిగా పచ్చటి తోవలో నడుస్తోంది..' పచ్చనాకు సాక్షిగా.. పెళ్లయిన తరువాత అంగిసింగి (నయాగఢ్ జిల్లా–ఒడిశా) అనే ఊళ్లోని అత్తగారింట్లోకి అడుగు పెట్టింది గీతారాణి సప్తతి. అంగిసింగి అనేది వ్యవసాయ ఆధారిత గ్రామం. అయితే రైతులు మాత్రం ‘ఎన్ని రసాయన ఎరువులు వాడితే వ్యవసాయానికి అంత మంచిది’ అనే ధోరణిలో ఉండేవారు. రైతులు పోటీపడి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల గ్రామంలో ఆస్తమా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండేది. గీత పిల్లలు కూడా ఆస్తమా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే గీత ‘కృషిమిత్ర’ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. గ్రామాలలో పర్యావరణహిత వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన కలిగించే స్వయం సహాయక బృందం సభ్యులను ‘కృషిమిత్ర’ అంటారు. తన గ్రామంలోని అస్తవ్యస్త వ్యవసాయ పద్ధతులను దృష్టిలో పెట్టుకొని శిక్షణ తరువాత గీత కూడా ‘కృషిమిత్ర’గా మారింది. ‘తక్కువ ఖర్చుతో పర్యావరణ హిత వ్యవసాయం చేయవచ్చు’ అనే నినాదంతో రైతుల దగ్గరకు వెళ్లింది గీత. రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల కలుగుతున్న నష్టాల గురించి వారికి వివరించింది. ప్రచారంతోపాటే తాను స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది. రైతుల భార్యలను పొలానికి తీసుకువెళ్లి తాను ఆచరిస్తున్న పద్ధతులను పరిచయం చేసేది. సేంద్రియ వ్యవసాయం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించేది. ‘తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం’ కాన్సెప్ట్‌తో గీత చేసిన సేంద్రియ వ్యవసాయం విజయవంతం అయింది. ఇక అప్పటినుంచి రైతుల్లో కదలిక మొదలైంది. గీతను వెదుక్కుంటూ వచ్చి, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకునేవారు. ‘ఒకప్పుడు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే కృషిమిత్ర నేను ఒక్కరినే. నేను చేస్తున్న వ్యవసాయాన్ని గమనించిన తరువాత ఇప్పుడు చాలామంది మహిళలు కృషిమిత్రగా మారారు’ అంటుంది గీత. ఒకవైపు ఇంటిపనులు, పొలం పనులు చేసుకుంటూనే మరోవైపు రైతుల పొలాల దగ్గరికి వెళ్లి వారికి అవసరమైన సలహాలు ఇస్తుంటుంది గీత. మొబైల్ ఫోన్ ద్వారా విజువల్స్, సమాచారాన్ని చేరవేస్తుంటుంది. గీత దినచర్య వేకువ జామునే మొదలవుతుంది. ఆగిపోయిన చదువును దూరవిద్య ద్వారా తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకుంది గీత. ఒకప్పుడు ఆమెను నిరుత్సాహపరిచిన భర్త, గీత మాటల వల్ల గ్రామ వ్యవసాయ పద్ధతుల్లో వస్తున్న మార్పులు, రైతులు చూపిస్తున్న గౌరవం చూశాక భార్యకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నాడు. మా ఊరు.. ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమైన నేను కృషిమిత్ర స్వయం సహాయక బృందంలో చేరడం వల్ల వ్యవసాయం, పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. నాకు తెలిసిన విషయాలను చుట్టుపక్కల వారితో పంచుకుంటున్నాను. ఆశను, ఆశయాలనూ ఎప్పుడూ వదులుకోవద్దు. కాస్త ఆలస్యం అయినా ఫలితం తప్పకుండా వస్తుంది అని చెప్పడానికే మా ఊరే నిదర్శనం. – గీతా రాణి సత్పతి, కృషిమిత్ర ఇవి చదవండి: స్వావలంబనకు చుక్కాని... రుబీనా! -
28 నుంచి ధర్మజ్ కార్ప్ ఐపీవో
న్యూఢిల్లీ: ఆగ్రో కెమికల్స్ తయారీ కంపెనీ ‘ధర్మజ్ కార్ప్ గార్డ్’ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెల 28 నుంచి మొదలు కానుంది. 30వ తేదీన ఇష్యూ ముగుస్తుంలది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిగా రూ.216–237ను ప్రకటించింది. గరిష్ట ధర ప్రకారం చూస్తే ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.251 కోట్ల వరకు సమీకరించనుంది. రూ.216 కోట్ల విలువ చేసే షేర్లను తాజా జారీ ద్వారా, మరో 14.83 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనుంది. ఐపీవో రూపంలో కంపెనీకి సమకూరే రూ.216 కోట్లను గుజరాత్‌లోని బరూచ్‌లో తయారీ కేంద్రం ఏర్పాటుకు వినియోగించనుంది. అలాగే, మూలధన అవసరాలకు, రుణాలను చెల్లించేందుకు ఉపయోగించుకోనుంది. పురుగు ముందులు, శిలీంద్ర సంహారిణి రసాయనాలు, సూక్ష్మ ఎరువులు తదితర ఉత్పత్తులను ధర్మజ్ తయారు చేస్తోంది. 25కు పైగా దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. చదవండి: PM Kisan New Rules: పీఎం కిసాన్‌లో కొత్త రూల్స్.. వాళ్లంతా అనర్హులు, ఈ పథకం వర్తించదు! -
బొప్పాయి.. సేంద్రియ సిపాయి!
- సేంద్రియ, ప్రకృతి సేద్య పద్ధతుల మేళవింపు - పకడ్బందీగా సేంద్రియ బొప్పాయి, మునగ సేద్యం.. - తొలి ఏడాదీ దిగుబడి తగ్గని వైనం.. - ఎకరానికి ఏటా రూ. లక్ష నికరాదాయమే లక్ష్యంగా సేంద్రియ సేద్యం ఉద్యాన పంటల్లో సేంద్రియ సేద్యం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే రసాయనిక వ్యవసాయానికి దీటుగా దిగుబడి పొందడం సాధ్యమేనా? ఇటు పోషకాల లోపం రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ.. అటు చీడపీడలను, వైరస్ తెగుళ్లను ద్రావణాలు, కషాయాలతో సమర్థవంతంగా ఎదుర్కొని మంచి దిగుబడులతో అధికాదాయం పొందడం సాధ్యమేనా?? ఈ ప్రశ్నలకు ముమ్మాటికీ సాధ్యమేనని ఏకలవ్య ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ స్వానుభవంతో చెబుతోంది. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈ ఫౌండేషన్ బొప్పాయి, మునగ సేంద్రియ తోటలు పెంచుతూ.. తొలి ఏడాదే ఆశ్చర్యకర ఫలితాలను నమోదు చేస్తోంది. రైతులు సేంద్రియ సేద్యం గుట్టుమట్లు తెలుసుకొని గనక పంటల సాగు చేపడితే.. నిశ్చింతగా రసాయనిక వ్యవసాయంతో దీటుగా దిగుబడి తీయడం, ఎకరంలో ఏడాదికి రూ. లక్ష నికరాదాయం పొందడం సుసాధ్యమేనని చాటుతున్న ‘ఏకలవ్య’ అనుభవాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. రైతుకు, పంట భూములకు, ప్రజారోగ్యానికి, ప్రకృతి వనరులకు విచ్చలవిడి రసాయనిక వ్యవసాయం నష్టదాయకంగా పరిణమించింది. దీనికి ప్రత్యామ్నాయంగా అనేక రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ముందుకొస్తున్నాయి. సేంద్రియ, ప్రకృతి సేద్యంపై ఒక్కొక్కరు ఒక్కో విషయం చెప్తుండడం వల్ల రైతుల్లో కొంత గందరగోళం నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో.. సమగ్రమైన సేంద్రియ సేద్య పద్ధతులను స్థిరీకరించి, పంటల వారీగా సాగు పద్ధతులను నమోదు చేయడం ద్వారా సేంద్రియ సేద్యం వైపు ఆకర్షితులయ్యే రైతులకు మార్గదర్శంగా ఉండేందుకు ఏకలవ్య ఫౌండేషన్ కృషి చేస్తోంది. సులువుగా అనుసరణీయమైన, ఖర్చు తక్కువతో కూడిన సాగు మెలకువలను మేళవించి.. కచ్చితమైన ఫలితాలనిచ్చే సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతిని కళ్లకు కట్టి చూపితే అన్నదాతలకు మేలు కలుగుతుందన్నది తమ అభిమతమని సేంద్రియ సేద్య విభాగం సారధి బూర్ల రమాకాంత్ ‘సాక్షి’తో చెప్పారు. ఇదే ఆలోచనతో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలో వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశామన్నారు. మిడ్జిల్ మండలం ఉరుకొండపేటలో ఐదెకరాల్లో బొప్పాయి తోటను, కల్వకుర్తి మండలం కుర్మిద్ద గ్రామంలో ఏడెకరాల్లో మునగ తోటను సాగు చేస్తున్నామన్నారు. మునగ (ఎకరానికి 900 మొక్కలు.. 6ఁ8) పూత దశలో ఉంది. జీవామృతం వడకట్టుకోవడానికి ఈ తోటలో అనుసరిస్తున్న మూడు జల్లెళ్ల పద్ధతి బాగుంది. సేంద్రియ బొప్పాయి సాగు పద్ధతులు, పోషకాల యాజమాన్యం, చీడపీడల నియంత్రణ తదితర అంశాలపై రమాకాంత్ అందించిన సమాచారం ఇలా ఉంది. ఘనజీవామృతం, వేపపిండి మిశ్రమం.. ఉరుకొండపేటలో వెంకట రమణ గోశాల పక్కన గల ఐదెకరాల ఎర్ర చల్కా పొలంలో.. సరిగ్గా 8 నెలల క్రితం బొప్పాయి 4,150 మొక్కలు నాటారు. మొక్కల మధ్య 6 అడుగులు, సాళ్ల మధ్య 8 అడుగుల దూరం పెట్టారు. దుక్కి చేసిన పొలంలో.. 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పున గుంతలు తవ్వారు. వేపపిండి, ఘనజీవామృతం సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని (ఎకరానికి 2 క్వింటాళ్లు) గుంతల్లో వేసి.. నెల రోజుల హైబ్రిడ్ బొప్పాయి మొక్కలు నాటారు. డ్రిప్ వేసి, మల్చింగ్ షీట్‌ను అమర్చారు. కల్వకుర్తి ప్రాంతంలో సాధారణ వార్షిక వర్షపాతం 550 ఎం.ఎం. కాగా, ఈ ఏడాది 400 ఎం.ఎం.కు పైగా నమోదైంది. 300 అడుగుల్లోతు నుంచి బోర్ల ద్వారా తోడిన నీటితో పంటలు సాగవుతున్నాయి. సేంద్రియ సాగు కావడం వల్ల, మల్చింగ్ వల్ల సాగు నీటిని పొదుపుగా వాడగలుగుతున్నారు. ‘సేంద్రియ ఎన్.పి.కె.’ ద్రవరూప ఎరువులు! నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను సేంద్రియ పద్ధతుల్లో ప్రత్యేక ద్రావణాల ద్వారా బొప్పాయి, మునగ పంటలకు నేలకు ఇవ్వడంతోపాటు పిచికారీ చేస్తుండడం విశేషం. వీటిని డ్రిప్ ద్వారా అయితే.. ఎకరం/200 లీటర్ల నీటికి 2 లీటర్ల చొప్పున, పిచికారీకి అయితే ఎకరం / 200 లీటర్ల నీటికి అర లీటరు నుంచి లీటరు వరకు కలుపుతున్నారు. నత్రజని కోసం: చేప + బెల్లం సమాన పాళ్లలో కలిపిన ద్రావణాన్ని 10 రోజులు మురగబెట్టి వారానికోసారి వాడుతున్నారు. భాస్వరం కోసం: 10 లీటర్ల నీటికి పశువుల ఎముకల బూడిద కిలో చొప్పున కలిపి 10 రోజులు మురగబెట్టిన తర్వాత వాడుతున్నారు. మొక్కలు నాటిన రెండు నెలల వరకు వారానికోసారి, ప్రస్తుతం నెలకోసారి వాడుతున్నారు. పొటాష్ కోసం: కిలో నాటు పొగాకు (తంబాకు) చూర, కాడలు, కాయలు + 25 లీటర్ల నీరు లేదా ఆవు మూత్రం లేదా నీరు - ఆవు మూత్రం చెరి సగం కలిపి వాడుతున్నారు. గోమూత్రంతో పిండినల్లి పరారీ: బొప్పాయి కాండంపై ఎప్పుడైనా పిండినల్లి కనిపిస్తే.. 10% గోమూత్రం (100 లీటర్ల నీటికి 10 లీటర్ల గోమూత్రం+ 150 గ్రా. సబ్బుపొడి కలిపి) పిచికారీ చేసి సమర్థవంతంగా అరికడుతున్నారు. వైరస్ వ్యాధుల నివారణకు: 200 లీ. నీటికి 20 గ్రాముల పీజీపీఆర్ బ్యాక్టీరియాను కలిపి నెలకోసారి పిచికారీ చేస్తున్నారు. వైరస్ సోకితే 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. ద్రావణాలు, కషాయాల పిచికారీకి షెడ్యూల్ తయారు చేసుకొని ప్రతి పిచికారీకి కనీసం వారం వ్యవధి ఉండేలా చూసుకుంటున్నామన్నారు. వీటి వల్ల మిత్రపురుగులకు ఎటువంటి నష్టమూ ఉండదన్నారు. కాండం కుళ్లు తెగులు నివారణ: పేడ పేస్ట్ బాగా పనిచేస్తున్నది. 5 కిలోల ఆవుపేడ + 5 లీటర్ల ఆవు మూత్రం + 250 గ్రా. సున్నం కలిపి పేస్ట్ తయారు చేసి.. బొప్పాయి చెట్టు కాండానికి రెండు నెలలకోసారి పూస్తున్నారు. వేరుకుళ్లు నివారణకు: 200 లీటర్ల జీవామృతంలో 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి బ్యాక్టీరియాను కలిపి.. 3 రోజులు మురగబెట్టి డ్రిప్ ద్వారా రెండు దఫాలు ఇస్తే అద్భుత ఫలితం వచ్చింది. ఇంకా బొప్పాయి తోటలో ఫంగస్ నివారణకు, కాయ నాణ్యత పెంపుదలకు పుల్ల మజ్జిగ పిచికారీ చేస్తున్నారు. వైరస్ తెగుళ్ల నివారణకు ఆవు పాలు బాగా పనిచేస్తున్నాయంటున్నారు. చిన్న, పెద్ద పురుగులకు చేప కునపజలాన్ని సైతం పిచికారీ చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. మరో ఏడాదికల్లా బొప్పాయి తోటలో ఆద్యంతం ఎదురయ్యే సమస్యలు, చీడపీడలు - సేంద్రియ పద్ధతుల్లో నివారణోపాయాలను రైతులకు పూర్తిస్థాయిలో అందించగలమని రమాకాంత్ ధీమాగా తెలిపారు. సేంద్రియ సేద్యంలో వైరస్ బెడద తక్కువ! తమ సేంద్రియ బొప్పాయి తోట ఆరున్నర నెలలకే కోతకొచ్చిందని, మొదటి నెలలోనే ఎకరానికి 4 టన్నుల దిగుబడి వచ్చిందని రమాకాంత్ (83747 21751) తెలిపారు. రానున్న 16 నెలల్లో ఎకరానికి 400 టన్నుల దిగుబడి సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. రసాయనిక వ్యవసాయంలో సాధారణంగా 7-8 నెలల బొప్పాయి తోటలో ఎల్లో మొజాయిక్ వైరస్ బారిన పడిన చెట్లు 60-80 శాతం వరకు కనిపిస్తుంటాయని, దిగుబడి తగ్గిపోవడానికి ఇదే ముఖ్య కారణమని ఆయన తెలిపారు. మొక్కలు నాటిన 8-9 నెలల తర్వాత వైరస్ పూర్తిగా కమ్మేయడం వల్ల పిందెలు ఏర్పడడం కష్టంగా మారి, ఏడాదిన్నరకే పంట ముగిసిపోతుంటుందన్నారు. అయితే, తమ తోటలో వైరస్‌ను 2 నెలల్లోనే నియంత్రించగలిగామని, వైరస్ సోకిన చెట్లు 20%కి మించి లేవన్నారు. వైరస్‌ను కంట్రోల్ చేయడం వల్ల పంట కాలం 6-7 నెలల పాటు పెరుగుతుందని, తద్వారా దిగుబడి అదనంగా వస్తుందన్నారు. సేంద్రియ సేద్యంలో వైరస్ కంట్రోల్ అవుతుంది కాబట్టి దిగుబడి బాగుంటుందని, రైతుకు మంచి ఆదాయం వస్తుందన్నారు. డ్రిప్ ద్వారా నీరు, పోషకాల సరఫరా తోట అంతటా ఒకేలా జరగాలంటే వాటర్ డిశ్చార్జి ఒకేలా ఉండాలన్నారు. డ్రిప్ ఉన్నా.. నెలకోసారి సాళ్ల మధ్యలో నీటి తడి ఇచ్చి, జీవామృతం వడకట్టాక మిగిలే మడ్డిని వేస్తున్నందున పంట ఏపుగా పెరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ‘ఏకలవ్య’ సేంద్రియ క్షేత్రంలో తొలి ఏడాదే అధిక దిగుబడి సాధిస్తుండడం అభినందనీయం. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : పీ ఏ నాగరాజు ‘జీవామృత పంచగవ్య’తో సత్ఫలితాలు బొప్పాయి, మునగ తోటల్లో పోషకాల యాజమాన్యంలో జీవామృతంతో పంచగవ్య కలిపి (‘జీవామృత పంచగవ్య’) వాడటం వల్ల చక్కని ఫలితాలొస్తున్నాయని రమాకాంత్ తెలిపారు. గ్రాము జీవామృతంలో 6 కోట్ల సూక్ష్మజీవులుండగా, ఇందులో 2,70,000 కోట్లున్నాయి. 200 లీటర్ల జీవామృతంలో 2 లీటర్ల పంచగవ్యను కలిపి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. జీవామృతం తయారీ కోసం 10 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం, కిలో బెల్లం, కిలో పప్పుల పొడి, 180 లీటర్ల నీటిని కలిపి.. 24 గంటల తర్వాత.. 2 లీటర్ల పంచగవ్యను కూడా పోసి కలపాలి. అలా ఆరు రోజులు మురగబెడితే ‘జీవామృత పండగవ్య’ వాడకానికి సిద్ధమవుతుంది. దీన్ని పూత దశ (మూడున్నర నెలల) వరకు 15 రోజులకోసారి డ్రిప్ ద్వారా ఇచ్చారు. ఆ తర్వాత 10 రోజులకోసారి, కాపు దశ నుంచి వారానికోసారి ఇస్తున్నారు. డ్రిప్ ద్వారా నేలకు ఇవ్వడంతోపాటు పిచికారీ కూడా చేస్తున్నారు. నూనె పిచికారీతో ‘వైట్ పీచ్ స్కేల్’కు చెక్! బొప్పాయి తోటలో ‘వైట్ పీచ్ స్కేల్’ (కాయపై తెల్లని బూజు) సమస్య నివారణకు అనేక ప్రయోగాలు చేశామని చెబుతూ.. పత్తి గింజల నూనెను పిచికారీ చేసి సత్ఫలితాలు సాధించారు. లీటరు పత్తి గింజల నూనెలో 100 ఎం.ఎల్. ఎమల్సిఫైర్ వేసి.. వంద లీటర్ల నీటిలో కలిపి.. అవసరమైనప్పుడు పిచికారీ చేస్తున్నారు. హై కంప్రెసర్ స్ప్రేయర్‌తో పిచికారీ చేసి బూజును చెదరగొడుతున్నారు. 15 లీటర్ల నీటికి 100 ఎం.ఎల్. కిరోసిన్ కలిపి లేదా 15 లీటర్ల నీటికి 6-7 ఎం.ఎల్. షాంపూ సాచెట్‌ను కలిపి పిచికారీ చేసినా మంచి ఫలితం వచ్చింది. అన్ని రకాల రసం పీల్చే పురుగులు, కొరికి తినే పురుగుల నుంచి పంటను కాపాడుకోవడానికి 5% పదాకుల (దశపత్ర) కషాయం (100 లీటర్ల నీటికి 5 లీటర్ల కషాయం)ను ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత నుంచి.. ఒక వారం పదాకుల కషాయం (5%), మరో వారం వేప నూనె (10,000 పీపీఎం)ను వంద లీటర్ల నీటికి 250 ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేస్తున్నారు.