ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్‌తో పాటుగా డైరెక్ట్-టు-హోమ్ (DTH), బ్రాడ్‌బ్యాండ్ వంటి అనేక రకాల సేవలను కూడా అందిస్తోన్న విషయం తెలిసిందే. ఎలాంటి టీవీనైనా స్మార్ట్‌టీవీగా మలిచేందుకు ఎయిర్‌టెల్ న్యూ ఎజ్ డీటీహెచ్ సేవలతో పాటుగా ఓటీటీ సేవలను ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీంతో అందిస్తోంది. కాగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లాన్ ధరలను పెంచుతూ ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ సేవలు నెలకు రూ. 49, వార్షిక ప్లాన్ రూ. 499 కే అందించేంది.
ఇప్పుడు నెలకు రూ. 125 ఖర్చుతో 12 ఓటీటీ సేవలు..!
టాటా స్కై బింజీ తరహాలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ ఓటీటీ సేవలను అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌తో యూజర్లు 12 రకాల ఓటీటీ సేవలను తక్కువ ధరకే పొందవచ్చును. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ రెండు రకాల ఆప్షన్స్‌తో లభిస్తోంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యూజర్లు నెలకు రూ. 149 రూపాయలను చెల్లించి ఆయా ఓటీటీ సేవలను పొందవచ్చును. ఏడాది ప్లాన్‌పై ఏకంగా రూ. 1000 పెంచి రూ. 1499కు 12 రకాల ఓటీటీ సేవలను అందించనుంది. ఒకవేళ యూజర్లు వార్షిక ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటే ఈ ఓటీటీ సేవలు నెలకు రూ. 125కే రానున్నాయి. ఎయిర్‌టెల్ తన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాన్‌ని బీటా టెస్టింగ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఆ 12 ఓటీటీ సేవలు ఇవే..!
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ నెలవారీ , లేదా వార్షిక ప్లాన్స్‌తో Eros Now, SonyLIV, Hoichoi, ShemarooMe, Lionsgate Play, Ultra, EpicON, Manorama Max, Divo, Dollywood Play, KLIKK, NammaFlix వంటి 12 రకాల ఓటీటీ సేవలను పొందవచ్చును.
చదవండి: చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు..! యూజర్ల దెబ్బకు ఒక్క రోజులోనే లక్షన్నర కోట్లు లాస్
Comments
Please login to add a commentAdd a comment