పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. మంచి ఫీచర్లతో, అందుబాటులో ధరలో ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ)లు మార్కెట్‌లోకి వస్తే.. అటు వైపు షిప్ట్ అయ్యేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీంతో ఏ కంపెనీ ఎప్పుడు ఏ మోడల్‌కి సంబంధించిన సమాచారం వెల్లడిస్తుందా అంటూ ఆరా తీస్తున్నారు. ఈ సమయంలో ఆనంద్ మహీంద్రా రెండో హింట్ వదిలారు.
ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో ఓ వాహనానికి సంబంధించిన ఫీచర్లను చూపీచూపనట్టుగా చిత్రీకరించారు. ఈ వెహికల్‌ని మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్, యూరప్ (ఆక్స్‌ఫర్డ్)లో డిజైన్ చేసిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు ఈ వాహనానికి సంబంధించిన ఫస్ట్ లుక్ 2022 జులైలో వస్తుందంటూ ప్రకటించారు.
చాన్నాళ్లుగా ఈవీ వాహనాన్ని మార్కెట్‌లో తెచ్చే పనిలో ఉంది మహీంద్రా గ్రూపు. ఈ మేరకు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలో చర్చ నడుస్తోంది. అయితే ఈవీ కారు ఎప్పుడు వస్తుందనే క్లారిటీ ఎవరి దగ్గరా లేదు. ఈ సందేహాలను తెర దించుతూ ఒక్కో హింట్ వదులుతూ వస్తున్నారు ఆనంద్ మహీంద్రా. వారం కిందట నెట్‌స్కోర్ జీరో వచ్చినందుకు గర్వంగా ఉంది అంటూ ఓ పోస్ట్ చేశారు. దానికి కొనసాగింపుగా రాబోయే ఈవీ వెహికల్ మెరుపులు చూపించడంతో పాటు 2022 జులైలో ఫస్ట్ లుక్ అంటూ సమయం కూడా చెప్పేశారు.
Bit by bit, we’re showing you our future… pic.twitter.com/kNmFzprUv7
— anand mahindra (@anandmahindra) April 12, 2022
చదవండి: స్కోర్ సున్నా వచ్చినా గర్వంగా ఉందన్న ఆనంద్ మహీంద్రా!
Comments
Please login to add a commentAdd a comment