సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించడం, మరుగున పడ్డ ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు అప్పుడప్పుడు తన మహీంద్రా బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన స్వయంగా ఈ వీడయోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో.. మూడు నుంచి కౌంట్ డౌన్ మొదలై జీరోకి వస్తుంది. వెంటనే నేను జీరో స్కోర్ చేశారు. అయినా నాకు గర్వంగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా చెబుతారు. అక్కడితో వీడియో ముగిసిపోతుంది.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది, ప్రభుత్వం కూడా ప్రోత్సహాం అందిస్తోంది. వాయు కాలుష్యం తగ్గించాలని, వెహికల్స్ నుంచి వెలువడే కార్బన్ పొల్యుషన్‌ని నెట్ జీరోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశీ కార్ల తయారీ సంస్థ టాటా ఈవీ కార్లతో మార్కెట్‌లో దూసుకుపోతుంది. మరోవైపు మహీంద్రా నుంచి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుందంటూ ప్రచారం జరుగుతున్నా.. ఇప్పటి వరకు స్పష్టత లేదు.
ఈ తరుణంలో మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్‌మహీంద్రా నేరుగా వీడియో రీలీజ్ చేయడం.. అందులో నెట్ జీరో స్కోరును చూపిస్తూ గర్వంగా ఉంది అనడం వంటి అంశాలు మహీంద్రా నుంచి రాబోయే ఈవీ వెహికల్‌కి సంకేతాలు అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తూన్నాయి. అందువల్లే తనకు జీరో స్కోర్ వచ్చినా గర్వంగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని విశ్లేషిస్తున్నారు.
Are there times when you can be #ProudToBeZero ? pic.twitter.com/YvBM16iJQt
— anand mahindra (@anandmahindra) April 8, 2022
చదవండి: Anand Mahindra: నితిన్ గడ్కారీజీ మనమూ ఇలా చేద్దామా?
Comments
Please login to add a commentAdd a comment