అభివృద్ధి గురించి ఎన్ని మాటలు చెప్పినా టెక్నాలజీ గురించి ఎంత వివరణ ఇచ్చినా సమాజంలో అట్టడుగు వర్గాలకు అది అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రయోజనం. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇన్నోవేషన్స్ అంటూ రోజుకో ప్రొడక్టు మార్కెట్‌లోకి వస్తోంది. కానీ గురు సౌరభ్ ఇన్నోవేషన్ సూపర్ అంటే సూపర్. అందుకే ఆనంద్ మహీంద్రా అతనికి అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు. గురు సౌరభ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానంటూ తనంతట తానుగా ప్రకటించాడు.
బైకులు, కార్లు ఎన్ని మార్కెట్లోకి వస్తున్నా ఇప్పటికీ సైకిల్‌కి ఉన్న ఆదరణ చెక్కు చెదరలేదు. దేశంలో 53 శాతం మంది ప్రజలకు ఇప్పటికీ వ్యక్తిగత వాహనం అంటే సైకిల్ మాత్రమే. అయితే వాడుతున్న సైకిల్‌కి పెద్దగా ఆల్ట్రేషన్ చేయకుండానే ఈవీ వెహికల్‌గా మార్చే అద్భుతమైన డివైజ్‌ని గురు సౌరభ్ తయారు చేశారు.
తాను రూపొందించిన డివైజ్‌తో వీడియో చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ సింపుల్ డివైజ్‌తో సైకిల్ ఈవీ వెహికల్‌గా మారిపోతుంది. 170 కేజీ బరువు మోసుకెళ్లగలుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఫైర్ , వాటర్, మడ్ ప్రూఫ్ కూడా. 20 నిమిషాల పాటు పెడల్స్ తొక్కితే దీని బ్యాటరీ 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇలా ప్రతీ అంశం వివరించడం కంటే మీరే ఆ వీడియో చూడండి.. తప్పకుండా మీకు నచ్చుతుంది.
It’s not inevitable that this will succeed commercially or be substantially profitable, but I still would feel proud to be an investor…Grateful if someone can connect me with Gursaurabh, (3/3) pic.twitter.com/GsuzgJECTo
— anand mahindra (@anandmahindra) February 12, 2022
Comments
Please login to add a commentAdd a comment