ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు వస్తుండటంతో దేశీ సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. మార్కెట్ ప్రారంభమైంది మొదలు ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్, అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు నష్టాలను చవి చూశాయి. ఆ వెంటనే పుంజుకుని లాభాల బాట పట్టాయి, గత కొంత కాలంగా కొనసాగిన పాజిటివ్ ట్రెండ్‌కి బ్రేక్ పడింది. మార్కెట్‌లో అస్థిరత నెలకొంది.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 58,418 పాయింట్లతో మొదలైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోతూ నిన్నటి ముగింపుతో పోల్చితే 17 పాయింట్లు నష్టపోయి 58,279 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత వెంటనే పుంజుకుంది. ఉదయం 9:20 గంటలకు 72 పాయింట్లు లాభపడి 58,351 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయినా తర్వాత కోలుకుని 17,362 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
చదవండి: గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment