ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 400 పాయింట్లు లేదా 0.77 శాతం నష్టపోయి 51,704 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా చివరకు 105 పాయింట్ల లేదా 0.68 శాతం క్షీణించి 15,208కు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.81 వద్ద నిలిచింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.81గా ఉంది. ఇంట్రాడేలో 52,068 వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ 51,600 వద్ద కనిష్ఠాన్ని తాకింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్ఐఎల్ తదితర సంస్థలు లాభాలను చూడగా.. నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్స్వ్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి), కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.(చదవండి: ఐదు సెకన్లలో 20 లక్షల ఎస్‌బీఐ పర్సనల్ లోన్)
Comments
Please login to add a commentAdd a comment