
ముంబై: స్టాక్ మార్కెట్‌పై విదేశీ ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోంది. అమెరికా ఫెడ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడంతో గత కొంత కాలంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేస్తూ తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. మరోవైపు ఉక్రెయిన్ వివాదం రోజుకోమలుపు తీసుకోవడం దానికి తగ్గట్టుగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. మరోవైపు దేశీయంగా క్యూ 3 ఫలితాల ప్రకటన దాదాపు చివరి దశకు చేరుకుంది. బడ్జెట్ మెరుపులు తెలిసిపోయాయి. దీంతో మార్కెట్‌కు ఉత్తేజాన్ని అందించే అంశాలేవీ కానరావడం ఫలితంగా అమ్మకాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి.
ఈ రోజు ఉదయం 9:15 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 57,551 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 84 పాయింట్లు నష్టపోయి 17,192 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment