
ముంబై: స్టాక్ మార్కెట్ జోరు కనిపిస్తోంది. వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ సానుకూల వాతావరణంలో ప్రారంభమైంది. సింగపూర్ స్టాక్‌మార్కెట్ సూచీలు సానుకూలంగా కదలాడుతుండటం దేశీ మార్కెట్‌పై ప్రభావం చూపించింది. దీంతో మార్కెట్ ప్రారంభమైన పది నిమిషాల్లోనే రెండు సూచీలు లాభాల బాట పట్టాయి.
ఈ రోజు ఉదయం 9:10 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడి 60,616 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 18,055 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఈ రోజు మార్కెట్ దృష్టి అంతా టాప్ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు ప్రకటించే మూడో త్రైమాసికం ఫలితాలపై ఉంది. ఈ కంపెనీలు సానుకూల ప్రకటన చేస్తే మార్కెట్ సూచీలు మరింతపైకి ఎగబాకే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment