ఈ వారం దీర్ఘకాలిక మూలధన లాభాలు, వాటి వల్ల ఏర్పడే పన్నుభారం గురించి తెలుసుకుందాం. ఆస్తి కొన్న తేది నుండి రెండు సంవత్సరాల తర్వాత .. ఆ ఆస్తి మీ చేతిలో కనీసం 2 ఏళ్లు దాటి ఉంటే దీర్ఘకాలికంగా వ్యవహరిస్తారు. ఇలా ఉండటాన్ని ‘హోల్డింగ్ పీరియడ్‘ అంటారు. అలాంటి ఆస్తిని అమ్మగా వచ్చే లాభాన్ని మూలధన లాభం అంటారు. ఇటువంటి మూలధన లాభంమీ పన్ను రేటు ప్రత్యేకంగా ఉంటుంది. మామూలుగా అయితే, శ్లాబులు, రేట్ల ప్రకారం పన్ను భారం లెక్కిస్తారు. అయితే, స్పెషల్ రేట్లు వర్తించే విషయంలో శ్లాబులు ఉండవు. రేటు 20 శాతంగా ఉంటుంది. అమ్మిన విలువలో నుంచి కొన్న విలువను తీసివేయగా వచ్చే మొత్తాన్ని లాభం అంటారు. ఈ లాభాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. ఈ ఆదాయమే పన్నుకు గురవుతుంది.
పన్ను లెక్కింపు ఇలా
2001 సంవత్సరానికి ముందు కొన్న ఆస్తి అయితే.. కొన్న విలువకు బదులు 01–04–2001 నాటి మార్కెట్ విలువను కొన్న విలువగా పరిగణిస్తారు. మార్కెట్ విలువను కాగితాల ద్వారా తీసుకోవాలి. నోటి మాటను పరిగణించరు. రికార్డులతో ధృవీకరించాలి. ఆ విలువను కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ (ఇౌట్ట ౌజ ఐnఛ్ఛీ) ద్వారా పెంచుతారు. 01–04–2001 నాడు 100గా ఉన్నది 2021–22 ఆర్థిక సంవత్సరంలో 317కి సమం అవుతుంది. మీరు 2001కి ముందు స్థిరాస్తి రూ. 75,000 కొన్నారనుకోండి లేదా రూ. 1,000 అనుకోండి లేదా వందే అనుకోండి. 01–04–2021 నాడు మాత్రం దాని విలువ రూ.1,20,000 అనుకోండి. దాన్ని 2021–22లో విక్రయిస్తే రూ. 1,20,000 / 100 గీ 317 = రూ. 3,80,400ని కొన్న ధరగా లెక్కిస్తారు. దీన్ని మీరు రూ. 10,00,000కు అమ్మారనుకోండి అప్పుడు క్యాపిటల్ గెయిన్ లేదా మూలధన లాభం.. రూ. 10,00,000 – 3,80,400 = రూ. 6,19,600 అవుతుంది. ఈ రూ. 6,19,600 మీ ద 20 శాతం చొప్పున పన్ను చెల్లించాలి. సుంకం అదనం. అంటే సుమారుగా రూ. 1,28,900గా ఉంటుంది.
చెల్లించకుండా ఉండాలంటే..
పన్ను చెల్లించకుండా చట్టప్రకారం ఎన్నో మార్గాలు ఉన్నాయి. నిర్దేశించిన విధంగా ఇన్వెస్ట్ చేస్తే పన్ను భారం ఉండదు. అలా వద్దనుకుంటే లావాదేవీ జరిగిన తర్వాత ఒకేసారి చెల్లించవచ్చు. ఏప్రిల్ 2022లో లావాదేవీ అయితే వెంటనే చెల్లించండి లేదా జూన్‌లో 15 శాతం, సెప్టెంబర్‌లో 30 శాతం, డిసెంబర్‌లో 30 శాతం, మార్చ్‌లో 25 శాతాన్ని అడ్వాన్స్ ట్యాక్స్‌గా చెల్లించండి. మార్చిలోపు మొత్తం చెల్లించాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నుండి గడువు తేదీలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ విషయం అంత తేలిగ్గా తేల్చలేము. ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
- కేసీహెచ్‌ఎవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు)
చదవండి: ఐటీ 30 శాతం శ్లాబులో ఉన్న వారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మేలు
Comments
Please login to add a commentAdd a comment