
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైగ్రేన్ చికిత్సలో ఉపయోగపడే వేరబుల్ డివైజ్ నెరీవియోను భారత్‌లో విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్)తో థెరానికా ఒప్పందం కుదుర్చుకుంది.
వ్యూహాత్మక లైసెన్స్, సరఫరా డీల్ ప్రకారం ప్రకారం నెరీవియోకు సంబంధించి డీఆర్‌ఎల్ దేశీయంగా మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని థెరానికా సీఈవో అలోన్ ఇరోనీ తెలిపారు. ఈ ఒప్పందం కేవలం భారత్‌కు మాత్రమే పరిమితమని చెప్పారు. దీన్ని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించడంపై ఇరు కంపెనీలు చర్చించడం కొనసాగిస్తాయని పేర్కొన్నారు.
చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి!