ఎలాన్ మస్క్ ఒక్కసారిగా రూటు మార్చాడు. ఇప్పటి వరకు ట్విటర్‌పై సెటైర్లు, బిల్‌గేట్స్ మీద విసుర్లతో కాలం వెళ్లదీసిన మస్క్ ఒక్కసారిగా పూర్తి స్థాయి ప్రొఫెషనల్‌గా మారిపోయాడు. తనలోని సీఈవో బయటకు వచ్చాడు. ఉద్యోగుల నుంచి తాను ఎలాంటి పనితీరు కోరుకుంటున్నాడో నేరుగా చెప్పాడు. అది నచ్చని వాళ్లు బయటకు వెళ్లిపోవచ్చంటూ కుండబద్దలు కొట్టాడు.
కరోనా సంక్షోభం తర్వాత గల్లీ స్థాయి నుంచి బడా కార్పొరేట్ వరకు అన్ని కంపెనీలు ఉద్యగులకు వర్క్‌ఫ్రం హోం లేదా రిమోట్ వర్క్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. రెండేళ్ల కాలంలో ఎప్పుడైనా వర్క్ ఫ్రం హోంకి పులిస్టాప్ పెడదాం అనుకునేలోగా కొత్త వేరియంట్లు, వేవ్స్ రావడంతో రిమోట్ వర్క్/ వర్క్‌ఫ్రంహోం కొనసాగుతూనే వచ్చింది.
సూటిగా
దీర్ఘకాలం వర్క్ ఫ్రం హోం/ రిమోట్ వర్క్ కొనసాగుతుండటంతో క్రమంగా ఉద్యోగులు ఈ విధానానికి అలవాటు పడిపోయారు. ఆఫీసులకు రమ్మంటే కష్టమంటూ రకరకాల కారణాలు చెబుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించలేక చివరకు ఆఫీస్ ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అందరిలా ఉంటే తాను ఎలాన్ మస్క్ ఎందుకు అవుతాడు. అందుకే రిమోట్ వర్క్‌పై తన వైఖరి ఏంటో ఉద్యోగులకు సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు.
ఆఫీస్‌కి రావాల్సిందే
రిమోట్ వర్క్ విధానంపై టెస్లా ఉద్యోగులకు ఎలాన్ మస్క్ ఇటీవల ఈమెయిల్ పెట్టారు. అందులో వారంలో కనీసం నలభై గంటలు ఆఫీసులు పని చేసి మిగిలిన సమయాన్ని రిమోట్ వర్క్‌లో చేసుకోవచ్చంటూ తేల్చి చెప్పాడు. ఈ విధానం నచ్చని వారు ఎవరైనా ఉంటే టెస్లాను వదిలి వెళ్లవచ్చంటూ స్పష్టం చేశాడు. ఏ ఉద్యోగికయినా రిమోట్ వర్క్ చేయాల్సిన అసాధారణ పరిస్థితులు ఉంటే.. వాటిని తానే స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాడు ఎలాన్ మస్క్.
#Tesla no longer allowing remote work@TeslaPodcast @SawyerMerritt @WholeMarsBlog @garyblack00 @GerberKawasaki pic.twitter.com/DKAgh9ptSX
— Sam Nissim (@SamNissim) June 1, 2022
ఎక్స్‌ట్రాకే రిమోట్
సాధారణంగా అమెరికాలో ఐదు రోజుల పని విధానం ప్రకారం లెక్క వేసుకున్నా రోజుకు ఎనిమిది గంటల చొప్పున ఐదు రోజులకు 40 గంటలు ఆఫీసులోనే పని చేయాల్సి ఉంటుంది. అంటే రిమోట్ వర్క్‌ను పూర్తిగా ఎత్తేశాడన్నమాట. 40 గంటలకు మించి ఎక్స్‌ట్రా వర్క్ చేసేప్పుడు మాత్రం రిమోట్ వర్క వినియోగించుకోవచ్చంటూ కంటి తుడుపు మాటగా చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment