కరోనా కారణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. అయితే ఇప్పుడు సైబర్ నేరస్తులు పంథా మార్చి ఈపీఎఫ్‌ఓ అకౌంట్లలో మనీని కాజేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌ఓ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ అకౌంట్‌లలో మోసాలు బాగా పెరిగిపోయాయి. ఫేక్ ఈపీఎఫ్ లింక్‌తో ఓటీపీలతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఈపీఎఫ్‌ఓ సంస్థ హెచ్చరించింది. తాము ఈపీఎఫ్‌ఓ ప్రతినిధుల మంటూ కాల్స్ చేసి వ్యక్తిగత వివరాల్ని తీసుకుంటున్నారని, అలాంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. అంతేకాదు ఈపీఎఫ్ సర్వీసుల కోసం ఈపీఎఫ్‌ఓ సంస్థ ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించదని తెలిపింది.
డిజిలాకర్‌తో భద్రం
ఈపీఎఫ్‌ఓ సంబంధించిన సమస్యలపై ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌లో నివృత్తి చేసుకోవాలని కోరింది. అలా వ్యక్తిగత వ్యక్తిగత డాక్యుమెంట్‌లను డిజిలాకర్‌లో భద్రపరుచుకోవాలని తెలిపింది. క్లౌడ్ ఆధారిత ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్ సురక్షితంగా ఉంటుందని, అందులో మీ డాక్యుమెంట్‌లను భద్రపరుచుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment