భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ విభాగాన్ని ప్రోత్సహించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రముఖ బ్యాటరీ స్వాపింగ్ కంపెనీ 'గొగోరో' (Gogoro) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు 'అల్ట్రా మెగా ప్రాజెక్ట్' ప్రారంభించనుంది. దీని కోసం దాదాపు 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!)
అల్ట్రా మెగా ప్రాజెక్ట్‌లో భాగంగా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో ఓపెన్ అండ్ యాక్సెస్ చేయగల బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. దీనికి మహారాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో రాష్ట్రం అగ్రగామిగా కావాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా దాదాపు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది.
(ఇదీ చదవండి: మస్క్ & జుకర్‌బర్గ్ రియల్ ఫైట్? చూడటానికి సిద్ధమేనా!)
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. కావున ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేయడానికి స్వాపబుల్ స్మార్ట్ బ్యాటరీ స్టేషన్‌లు చాలా సహాయపడతాయి. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడంలో కూడా సహాయపడే అవకాశం ఉందని భావిస్తున్నాయి.
తైవాన్‌లో మల్టిపుల్ వెహికల్ తయారీదారులకు మద్దతు ఇచ్చే ఓపెన్ బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌ను గొగోరో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి భారతదేశంలో కూడా తన ఉనికిని చాటుకోనుంది. ఇది తప్పకుండా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment