
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. మూడు రోజులుగా స్తబ్దుగా ఉన్న పసిడి రేట్లు ఈరోజు (సెప్టెంబర్ 11) ఎగిశాయి. దీంతో కొనుగోలుదారుల ఉత్సాహం నీరుగారింది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.67,150 వద్దకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.410 పెరిగి రూ. 73,250 వద్దకు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు పెరిగాయి.
ఇదీ చదవండి: ‘స్టార్ ధన్ వృద్ధి’.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఈరోజు పసిడి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.67,300 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 410 ఎగిసి రూ.73,400 వద్దకు చేరుకుంది.
వెండి కూడా..
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో బుధవారం కూడా పెరుగదల కనిపించింది. హైదరాబాద్‌లో క్రితం రోజున కేజీకి రూ.1000 మేర పెరిగిన వెండి ధర నేడు రూ.500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,500 వద్దకు పెరిగింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)