దసరా నాడూ మరింత ఖరీదైన బంగారం | Gold and Silver Price Today On 12 October 2024 | Sakshi
Sakshi News home page

దసరా నాడూ మరింత ఖరీదైన బంగారం

Published Sat, Oct 12 2024 2:51 PM | Last Updated on Sat, Oct 12 2024 3:21 PM

Gold and Silver Price Today On 12 October 2024

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన పసిడి ఈరోజు (అక్టోబర్‌ 12) కూడా సుమారుగా పెరిగాయి. దీంతో దసరా పండుగ రోజు బంగారం కొనేవారికి కాస్తంత నిరాశ తప్పలేదు.

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ చోట్ల ఈరోజుల 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.71,200 లకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.270 ఎగిసి రూ. 77,670 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇదే స్థాయిలో ధరలు ఎగిశాయి.

దేశ రాజధాని ఢిల్లిలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.71,350 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ.77,820 వద్దకు చేరింది.

వెండిదీ అదే దారి
Silver Price Today: దేశంలో వెండి ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. క్రితం రోజున కేజీకి రూ.2000 పెరిగిన వెండి నేడు రూ.1000 ఎగిసింది. దీంతో హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.1,03,000 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement