ధర వింటేనే దడ.. మళ్లీ పెరిగిన బంగారం | Gold and Silver Price Today On 19 October 2024 | Sakshi
Sakshi News home page

ధర వింటేనే దడ.. మళ్లీ పెరిగిన బంగారం

Published Sat, Oct 19 2024 11:49 AM | Last Updated on Sat, Oct 19 2024 1:03 PM

Gold and Silver Price Today On 19 October 2024

Gold Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గేదే లేదన్నట్టుగా పరుగుతీస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు (అక్టోబర్‌ 19) కూడా పసిడి పైకే ఎగిసింది. నేడు పుత్తడి రేట్లు ఎక్కడెక్కడ ఎంత మేర పెరగాయన్నది ఇక్కడ చూద్దాం.

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా  వివిధ చోట్ల ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.72,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.440 పెరిగి రూ. 79,420 వద్దకు ఎగిసింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇవే స్థాయిలో ధరలు ఉన్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లిలోనూ నేడు బంగారం ధరలు మరింత పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం రూ.380 పెరిగి రూ.72,930 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.440 పెరిగి రూ.79,570 వద్దకు చేరాయి.

వెండి మరింత స్పీడ్‌..
Silver Price Today: దేశంలో వెండి ధరలు కూడా నేడు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2000 ఎగిసి కొత్త గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రూ.1,07,000 లను తాకింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement