Gold Price Today: బంగారం కొనుగోలుదారుల ఉత్సాహం ఆవిరైంది. దేశంలో పసిడి ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 20) భారీగా పెరిగాయి. మూడు రోజుల్లో తగ్గిన దానికి మించి శుక్రవారం ధరలు ఎగిశాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒకేసారి రూ.600 పెరిగి రూ.68,850 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ఏకంగా రూ.660 ఎగిసి రూ. 75,110 లను తాకింది.బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.ఢిల్లీలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.69,000 లను చేరుకుంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.660 హెచ్చి రూ.75,260 వద్దకు పెరిగింది.
ఇదీ చదవండి: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడి
వెండి ధరలు సైతం
దేశవ్యాప్తంగా వెండి ధరలు సైతం ఈరోజు భారీగా పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న సిల్వర్ రేట్లు శుక్రవారం కేజీకి ఏకంగా రూ.1500 పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.97,500లను తాకింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment