Gold Price Today: దేశంలో బంగారం ధరల తగ్గుముఖం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు బుధవారం (నవంబర్ 13) పసిడి రేట్లు గణనీయంగా తగ్గాయి. గడిచిన ఐదు రోజుల్లో బంగారం తులానికి (10 గ్రాములు) రూ.2600 పైగా దిగివచ్చింది. ఈ తగ్గింపు ఇలాగే కొనసాగి ధరలు మరింత దిగిరావాలని పసిడి ప్రియులు ఆశిస్తున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలు ఎంతెంత తగ్గాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.400 తగ్గి రూ.70,450 లకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.440 క్షీణించి రూ. 76,850 వద్దకు దిగివచ్చింది.
ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు క్షీణించాయి. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.400 తగ్గి రూ.70,600 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 తగ్గి రూ.77,000 వద్దకు క్షణించింది.
సిల్వర్ రివర్స్
Silver Price Today: బంగారం ధరలకు విరుద్ధంగా నేడు దేశవ్యాప్తంగా వెండి ధరలు భగ్గుమన్నాయి. హైదరాబాద్లో కేజీ వెండిపై రూ.1000 పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి మళ్లీ రూ.1,01,000 దగ్గరకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment