పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..? | Gold and Silver Rates Today On Commodity Market | Sakshi
Sakshi News home page

పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?

Published Tue, Jun 4 2024 11:54 AM | Last Updated on Tue, Jun 4 2024 12:15 PM

gold and silver rates today on commodity market

ఈక్విటీమార్కెట్‌లు మంగళవారం భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. స్థిరప్రభుత్వం ఏర్పడదేమోననే భయాలు మార్కెట్లను కుంగదీశాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీమార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,800 (22 క్యారెట్స్), రూ.72,870 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.700, రూ.760 పెరిగింది.

చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.790, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.860 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,450 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,580 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,950.. 24 క్యారెట్ల ధర రూ.73,020కు చేరాయి. మార్కెట్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.98,500కు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement