
న్యూఢిల్లీ: కొద్దీ రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు(ఫిబ్రవరి 9) దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.640కు పైగా పెరిగి రూ.48000 చేరుకుంది. కొద్దీ రోజుల క్రితం బడ్జెట్ ప్రకటన అనంతరం పసిడి ధరలు భారీగా క్షీణించాయి. దాదాపు రూ.2000కు పైగా తగ్గాయి. ఒకనొక సమయంలో రూ.47,000 దిగువకు వచ్చాయి. బంగారం ధరలు ఈ వారం కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.640కు పైగా పెరిగి రూ.48,710 చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.590కు పైగా పెరిగి రూ.44,650 చేరుకుంది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోల్చి చూస్తే రూ.7,490 తక్కువగా ఉంది. ఇంతకు ముందు ఓ సమయంలో రూ.9000 వరకు తక్కువకు వెళ్లింది. ఈ సెషన్లలో రూ.640 వరకు పెరిగింది. దీంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చి చూస్తే ఒక్కరోజే 1కేజీ వెండిపై రూ.2,100 పెరిగి 75,200కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా పెరుగుతున్న కారణంగా మన దేశంలో కూడా ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment