ముంబై : గత రెండు రోజుల్లో 1500 రూపాయలు పెరిగిన బంగారం ధరలు బుధవారం దిగివచ్చాయి. రెండ్రోజుల్లో ఏకంగా 2000 రూపాయలు పైగా భారమైన వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల ఒడిదుడుకులతో దేశీ మార్కెట్‌లో బంగారం, వెండి పతనాల బాట పట్టాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 411 రూపాయలు తగ్గి 53,160 రూపాయలకు దిగివచ్చింది. ఇక 1905 రూపాయలు తగ్గిన కిలోవెండి 67,600 రూపాయలు పలికింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో అనిశ్చితి నెలకొందని, ఔన్స్ బంగారం 2000 డాలర్ల వద్ద స్ధిరపడినా మదుపరులు ఆచితూచి వ్యవహరించాలని కొటాక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ఉద్దీపన ప్యాకేజ్‌పై అగ్రదేశం చేపట్టే చర్యలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి, డాలర్‌తో రూపాయి విలువ పతనం వంటి కారణాలతో భారత్‌లో ఈ ఏడాది బంగారం ధరలు ఏకంగా 40 శాతం పెరిగాయి. చదవండి : పసిడి నేల చూపులు
Comments
Please login to add a commentAdd a comment