పసిడి జోరుకు బ్రేక్‌.. నేడు తులం ఎంతంటే.. | Gold Rate and Silver Price Today On 22 September 2024 | Sakshi
Sakshi News home page

పసిడి జోరుకు బ్రేక్‌.. నేడు తులం ఎంతంటే..

Published Sun, Sep 22 2024 12:23 PM | Last Updated on Sun, Sep 22 2024 12:33 PM

Gold Rate and Silver Price Today On 22 September 2024

Gold Price Today: వరుసగా రెండు రోజులుగా కొనసాగుతున్న బంగారం జోరుకు బ్రేక్‌ పడింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు (సెప్టెంబర్‌ 22) కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. నిన్నటి భారీ పెరుగుదల తర్వాత ఈరోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.69,600 వద్ద, 24 క్యారెట్ల పుత్తడి  రూ. 75,930 వద్ద కొనసాగుతన్నాయి. అదేవిధంగా బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇవే రేట్లు ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.69,750లుగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.76,080 లుగా కొనసాగుతన్నాయి.

ఇదీ చదవండి: గడువు ముగియనున్న ఎస్‌బీఐ స్పషల్‌ స్కీమ్‌

వెండి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు ఎలాంటి పెరుగుదల లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.98,000 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement