
బంగారం ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. గడచిన వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.2వేలు పెరిగింది. రానుంది పెళ్లిళ్ల సీజన్ కావడంతోపాటు జూన్‌లో ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తుందని ఊహాగానాల నేపథ్యంలో బంగారం ధర గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం దేశంలో పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,740 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,080గా ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,740 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,080గా ఉంది.
- వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,485గా ఉంది.
- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,850గా ఉంది.
- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,150 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,620గా ఉంది
- ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,600 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,000గా ఉంది.
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,850గా ఉంది.