అంత పెరిగి ఇంతే తగ్గింది.. నేటి పసిడి ధరలివే.. | Gold rates today November 9th 2024 | Sakshi
Sakshi News home page

అంత పెరిగి ఇంతే తగ్గింది.. నేటి పసిడి ధరలివే..

Published Sat, Nov 9 2024 12:08 PM | Last Updated on Sat, Nov 9 2024 12:26 PM

Gold rates today November 9th 2024

Gold Price Today: దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులకు కాస్త ఊరటను కలిగించాయి. క్రితం రోజున భారీగా పెరిగిన పసిడి రేట్లు ఈరోజు (నవంబర్‌ 9) స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా  వివిధ ప్రాంతాల్లో నేడు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర స్వల్పంగా రూ.100 తగ్గి రూ.72,750 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా  రూ.110 క్షీణించి రూ. 79,360 లకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై  ప్రాంతాలలోనూ  ఇదే స్థాయిలో ధరలు క్షీణించాయి.

ఇదీ చదవండి: డిసెంబర్‌ 14 డెడ్‌లైన్‌.. ఆ తర్వాత ఆధార్‌ కార్డులు రద్దు!

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,900 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.79,510 వద్దకు దిగొచ్చింది.

నిలకడగా వెండి
Silver Price Today: దేశంలో వెండి ధరలు శనివారం నిలకడగా ఉన్నాయి. క్రితం రోజున కేజీకి రూ.1000 పెరిగగా నేడు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,03,000 వద్ద కొనసాగుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement