న్యూఢిల్లీ: దివాలా చట్టంలో లొసుగులు సవరించిన లక్ష్యంగా కేంద్రం ముందడుగు వేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని నిపుణులు, సంబంధిత వర్గాలను కోరింది. ఇందుకు వచ్చే ఏడాది జనవరి 13 వరకూ గడువు విధించింది. వేగవంతమైన అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ, రిజల్యూషన్ ప్లాన్‌ల ఆమోదం నిమిత్తం కాల వ్యవధి, అక్రమ లావాదేవీలు, తప్పుడు వ్యాపారం నివారణ వంటి అంశాలకు సవరణలు చేయాలని ఇప్పటికే ఇన్సాల్వెన్సీ లా కమిటీ(ఐఎల్‌సీ) సిఫారసు చేసింది.
అంతేకాకుండా, స్వచ్ఛంద లిక్విడేషన్ ప్రక్రియ, ఐబీసీ ఫండ్ మూసివేయడానికి సంబంధించి సవరణల సూచనలూ ఉన్నాయి. 2016లో ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చింది. రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో కంపెనీ ఆఫ్ క్రెడిటార్స్(సీఓసీ)ది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది.
జీఎస్‌టీ చట్టంపై కూడా..
జీఎస్‌టీ చట్టం, పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో మార్పుల దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థికశాఖ) చైర్మన్ జయంత్‌సిన్హా తెలిపారు. దీనివల్ల కంపెనీలు డేటాను వినియోగించుకోవడం ద్వారా మరింత బలోపేతం, విస్తరించడానికి వీలుంటుందన్నారు.
(చదవండి: మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ కూడా అదుర్స్!)
Comments
Please login to add a commentAdd a comment