ఉద్యోగులకు రుణాలు కావాలంటే నేరుగా పేస్లిప్‌లు తీసుకెళ్లి అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు బ్యాంకులో ఇచ్చేసి రుణాలు తీసుకుంటారు. అదే రైతులకు రుణాలు కావాలంటే భూమి పట్టా పుస్తకాలు బ్యాంకులో తనఖా పెట్టాల్సి ఉంటుంది. అయితే చాలామందికి వారు పండిస్తున్న పంటభూమికి పట్టాలుండవు. కవులు రైతులు రుణాలు తీసుకోవాలంటే చాలాకష్టంతో కూడుకున్న వ్యవహారం.
పంట మార్కెట్‌కు తరలించి వచ్చినకాడికి తెగనమ్ముకుని ఆ డబ్బును తదుపరి పంట కోసం పెట్టుబడికి ఉపయోగిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. భవిష్యత్తులో సరుకు మంచిధర పలుకుతుందని తెలిసినా అవసరాల కోసం అమ్ముకోక తప్పదు. అలాంటి వారికోసం ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది.
ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఉన్న గోదాముల్లో రైతులు తమ పంటలను స్టోర్ చేసుకుంటే, వీటిపై లోన్లు పొందేందుకు కేంద్రం వీలు కలిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఫుడ్ అండ్ కన్జూమర్ అఫైర్స్ మినిస్టర్ పియూష్ గోయల్ సోమవారం ‘ఈ–కిసాన్ ఉపజ్ నిధి’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఈ విధానం అమల్లోకి వస్తే రైతుల ఆదాయాలు పెరుగుతాయని మంత్రి అన్నారు. వేర్ హౌస్ ఓనర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్లను ఒక శాతానికి తగ్గిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 3 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్‌బీఐ
వంట నూనెల దిగుమతులు తగ్గించేలా..
వంట నూనెల దిగుమతులను తగ్గించి, నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు ఓ మిషన్ లాంచ్ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా సోమవారం పేర్కొన్నారు. ఇందుకోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. దీంతో పాటు అస్సాంలో ఏర్పాటు చేసిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఏ)ను ఆయన ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment