న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థల నిర్వహణలోని (ఎంఎఫ్‌ఐ) రుణ ఆస్తులు గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 22 శాతం పెరిగి రూ.3.48 లక్షల కోట్లకు చేరాయి. ఎంఎఫ్‌ఐల స్థూల రుణాల పోర్ట్‌ఫోలియో 2022 మార్చి నాటికి రూ.2.85 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఇక 2022–23లో మంజూరు చేసిన మొత్తం రుణాల విలువ 23 శాతం పెరిగి రూ.2,96,423 కోట్లకు చేరింది. ఇది 2022 మార్చి నాటికి రూ.2,39,433 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 7.17 కోట్ల రుణాలు పంపిణీ అయ్యాయి.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మంజూరైన 6.30 కోట్ల రుణాలతో పోలిస్తే మెరుగైన వృద్ధి కనిపించింది. మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్‌వర్క్ (ఎంఫిన్) ఈ వివరాలను వెల్లడించింది. సూక్ష్మ రుణాలకు సంబంధించిన యాక్టివ్ రుణ ఖాతాలు 14.6 శాతం పెరిగి 2023 మార్చి నాటికి 13 కోట్లుగా ఉన్నాయి. స్థూల రుణాల మంజూరులో తూర్పు, ఈశాన్యం, దక్షిణాది రాష్ట్రాల వాటాయే 63 శాతంగా ఉంది. సూక్ష్మ రుణాల్లో బీహార్ అత్యధిక వాటా కలిగి ఉండగా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment