దేశీయంగా వయస్సు పైబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీఆర్‌బీ గణాంకాల ప్రకారం 2050 నాటికి 14.4 కోట్ల మంది పైచిలుకు సీనియర్ సిటిజన్స్ ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యానికి, సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మన కుటుంబాల్లో కూడా పెద్దవారికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఆరోగ్య బీమా అవసరం ఎంతైనా ఉంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు వారి అవసరాలను దృష్టిలోఉంచుకోవాలి. ఇందుకోసం అయిదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.
► వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి: ఆరోగ్యబీమా పాలసీ కవరేజీ సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెయిటింగ్ పీరియడ్, అలాగే ఎలాంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేకుండా అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా కవరేజీ లభించేలా చూసుకోవాలి. ఉదాహరణకు, మణిపాల్ సిగ్నా అందించే ప్రైమ్ సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సీనియర్ల విభిన్న ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినది. ఎటువంటి మెడికల్ చెకప్‌లు అవసరం లేకుండా 91వ రోజు నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ అనారోగ్య పరిస్థితులకు కవరేజీని అందిస్తుంది.
► కో–పే, ఉప–పరిమితులు ఉండొద్దు: కో–పే, ఉప–పరిమితులు ఉండని హెల్త్ ప్లాన్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే సబ్–లిమిట్ ఉన్న ప్లాన్ వల్ల మళ్లీ మన జేబుపై భారం పడుతుంది. పాలసీ పరిధిలోకి రాని కొన్ని ఖర్చులను మనమే భరించాల్సి వస్తుంది.
► అపరిమితంగా సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరణ: ఆరోగ్య బీమాలో పరిగణనలోకి తీసుకోతగిన మరో పెద్ద అంశం ఏమిటంటే, సమ్ ఇన్సూర్డ్‌ను అపరిమితంగా రీస్టోర్ చేసే అవకాశం. ఉదాహరణకు మీరు ఏదైనా నిర్దిష్ట అనారోగ్యానికి సంబంధించిన, లేక దానికి సంబంధించని మరోదాని కోసమైనా కొత్తగా క్లెయిమ్ చేసినప్పుడు, మీ హెల్త్ ప్లాన్ తప్పకుండా సమ్ ఇన్సూర్డ్ 100 శాతం పునరుద్ధరించేటువంటిదై ఉండాలి.
► క్యుములేటివ్ బోనస్: క్లెయిమ్స్ గానీ దాఖలు చేయని పక్షంలో కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో సమ్ ఇన్సూర్డ్‌కి ఏటా 10 శాతం మేర క్యుములేటివ్ బోనస్ జతవుతుంటుంది. సమ్ ఇన్సూర్డ్‌కి 100 శాతం స్థాయికి చేరే వరకు ఈ బోనస్ ఏటా జతవుతూనే ఉంటుంది. ఫలితంగా పదేళ్లలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కవరేజీ రెట్టింపవుతుంది.
► ప్రివెంటివ్ చెకప్: తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వయో వృద్ధులు తరచుగా వైద్యులను సంప్రదించాల్సి వస్తుంటుంది. అపాయింట్‌మెంట్లు లభించడం కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. కాబట్టి బీమా సంస్థల నెట్‌వర్క్ పరిధిలోని డాక్టర్లు, స్పెషలిస్టులతో అపరిమిత టెలీకన్సల్టేషన్స్ (ఫోన్ లేదా చాట్ ద్వారా) సదుపాయం ఇచ్చే ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. అలాగే ఏటా నగదురహిత హెల్త్ చెకప్ అందించేదిగా కూడా పాలసీ ఉండాలి.
ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, వాటి ఫీచర్లు, వ్యయాలను జాగ్రత్తగా పోల్చి చూసుకోవాలి. సీనియర్ సిటిజన్స్‌కు శారీరకంగాను, ఆర్థికంగాను ప్రయోజనకరంగా ఉండే సమగ్రమైన ఆరోగ్య బీమా కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవాలి.
– ప్రియా గిల్‌భిలే, సీవోవో, మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్
Comments
Please login to add a commentAdd a comment