సీనియర్‌ సిటిజన్‌లకు ఆరోగ్య బీమా పాలసీలు | dheerendra kumar advice and counceling in finace and policy's | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజన్‌లకు ఆరోగ్య బీమా పాలసీలు

Published Mon, Jan 23 2017 2:43 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

సీనియర్‌ సిటిజన్‌లకు ఆరోగ్య బీమా పాలసీలు

సీనియర్‌ సిటిజన్‌లకు ఆరోగ్య బీమా పాలసీలు

మా అమ్మా,నాన్నల కోసం ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలనుకుంటున్నాను. అందుబాటులో ఉన్న సీనియర్‌ సిటిజన్‌లకు సంబంధించిన మంచి ఆరోగ్య బీమా పాలసీలను సూచించండి. –రవి కుమార్, విశాఖపట్టణం
సీనియర్‌ సిటిజన్‌లకు పలు సంస్థలు ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. అపోలో మ్యూనిచ్‌ ఆప్టిమ సీనియర్, రెలిగేర్‌ హెల్త్‌కేర్, స్టార్‌  హెల్త్‌ సీనియర్‌ సిటిజన్స్‌ రెడ్‌ కార్పెట్‌.. ఈ సంస్థల çపాలసీలను పరిశీలించవచ్చు. సీనియర్‌ సిటిజన్‌  అవసరాలను తీర్చేలా  ఈ పాలసీలను రూపొందించారు. హాస్పిటల్‌లో చేరినా, డొమిసిలియరీ హాస్పిటలైజేషన్‌ (మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఇంటి దగ్గరే చికిత్స పొందే)లను కవర్‌ చేసేలా ఈ పాలసీలున్నాయి.  ఈ పాలసీల ప్రీమియమ్‌లు కూడా అధికంగానే ఉంటాయి. ఈ పాలసీల ప్రీమియమ్‌లు, ఫీచర్లు, మినçహాయింపులు, పాలసీ తీసుకునేటçప్పటికే ఉన్న జబ్బులకు కవరేజ్‌ తదితర పలు అంశాలను పరిశీలించి మీకు తగిన పాలసీని ఎంచుకోండి. నగదు రహిత వైద్యం అందించడమే వైద్య బీమా పాలసీల ముఖ్య లక్షణంగా ఉండాలి. అందుకని మీరు తీసుకునే పాలసీలో నగదు రహిత వైద్యమందించే నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ను చెక్‌ చేసుకోవాలి. మీరు ఉండే నగరంలో గానీ, మీ నగరానికి సమీపంలో ఉండే ఇతర నగరాల్లో కానీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ ఉండేలా చూసుకోవాలి.

నేను ప్రవాస భారతీయుడిని. చాలా ఏళ్ల క్రితమే కెనడా వెళ్లి అక్కడే స్థిరపడ్డాను. నేను భారత మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?
–సాగర్, ఈ మెయిల్‌ ద్వారా
అమెరికా, కెనడాల్లోని ప్రవాస భారతీయుల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ స్వీకరించే కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఉన్నాయి. వాటి వివరాలు.., బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా మ్యూచువల్‌ ఫండ్, ఎల్‌  అండ్‌ టీ మ్యూచువల్‌ ఫండ్, పీపీఎఫ్‌ఏఎస్‌ మ్యూచువల్‌ ఫండ్, సుందరమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. వీటిల్లో మీ ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరాలకు తగిన ఫండ్‌ను ఎంచుకొని సిస్టమాటిక్‌  ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి.  

ఇటీవల కాలంలో ఫార్మా, ఐటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు సరిగ్గా లేదు. భవిష్యత్తులో వీటి పనితీరు బాగా ఉంటుందనే అంచనాలతో ఫా ర్మా, ఐటీ మ్యూచువల్‌  ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. సిస్టమాటిక్‌  ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)విధానంలో కనీసం ఐదేళ్ల పాటు ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనేది నా ఆలోచన. నా నిర్ణయం సరైనదేనా? –జాకబ్, కరీంనగర్‌
ఫార్మా, ఐటీ, ఇలా ఒకే రంగంపై దృష్టి సారించే సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కొంత రిస్క్‌తో కూడిన వ్యవహారమే. సంబంధిత రంగంలో ఏర్పడే ప్రతికూలతల కారణంగా ఇలాంటి సెక్టోరియల్‌ ఫండ్స్‌ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇలాంటి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేసేవారు ఆయా రంగాల్లో వస్తున్న పరిణామాల పట్ల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ప్రతికూల పరిస్థితులు తలెత్తబోతాయని అంచనా వేసినప్పుడు తక్షణం ఆ ఫండ్ల నుంచి వైదొలగాలి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఇన్వెస్ట్‌ చేయగలిగాలి.  సాధారణ ఇన్వెస్టర్లకు ఈ అవగాహన ఉండదు. అందుకని ఈ తరహా ఫండ్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. కాదు కూడదు తప్పనిసరిగా సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే మాత్రం మీ పోర్ట్‌ఫోలియోలో స్వల్పమొత్తంలోనే పెట్టుబడులను ఈ సెక్టోరియల్‌ ఫండ్స్‌కు కేటాయించాలి.

ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరాలను ఇప్పుడు పలు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్స్‌ తీరుస్తున్నాయి. ఈ డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ వివిధ రంగాల్లోని కంపెనీల్లో ఇన్వెస్ట్‌  చేస్తాయి. వీటిని నిర్వహించే ఫండ్‌  మేనేజర్లు ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారు.  ఏ రంగం భవిష్యత్తు ఎలా  ఉంటుందో,  వివిధ పరిణామాల కారణంగా ఏ రంగం ఎంత తీవ్రంగా ప్రభావితమవుతుందో తదితర అంశాలపై అవగాహన సాధారణ ఇన్వెస్టర్‌ కన్నా ఇలాంటి ప్రొఫెషనల్‌ ఫండ్‌ మేనేజర్లకు అధికంగా ఉంటుంది. అందుకని సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా మంచి ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తేనే మంచి రాబడులు పొందుతారు. అందుకని మంచి రేటింగ్‌ ఉన్న ఒకటి, లేదా రెండు ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించండి.

నేను చాలా సంవత్సరాల క్రితమే అమెరికాకు వెళ్లి, అక్కడే సెటిల్‌ అయ్యాను. నా కూతురు అమెరికాలోనే పుట్టింది. అమెకు ఇప్పుడు 9 సంవత్సరాలు. పీఐఓ (పర్సన్స్‌  ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌–పీఐఓ) హోదా ఉన్న నా కూతురు పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవ వచ్చా? –ప్రకాశ్‌ జైన్, ఈ మెయిల్‌
మీ కూతురు భారత్‌లో జన్మించనందున సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌కు ఆమె అర్హురాలు కాదు. ప్రవాస భారతీయులు, పీఐఓ, ఓసీఐ హోదా ఉన్నవారికి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరడానికి అర్హత ఉండదు. భారత్‌లోనే పుట్టి, భారత్‌లోనే పెరిగే బాలికలకే ఈ స్కీమ్‌ కింద ఖాతా ప్రారంభించే అర్హత ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement