ముంబై, పూణే, ఢిల్లీ, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో నివసించే చాలా మందికి క్రెడిట్ కార్డు అనేది ఒక నిత్యావసరంగా మారింది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే క్రెడిట్ కార్డు పొందడం అనేది సులభం. ఎందుకంటే, క్రెడిట్ కార్డు జారీ చేయడానికి ముందు బ్యాంకులు, కార్డు కంపెనీలు మీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని కార్డును మంజూరు చేస్తాయి. దీని కోసం, మీరు శాలరీ స్లీప్స్, ఆదాయపు పన్ను రిటర్న్(ఐటిఆర్) మొదలైన వాటిని వారికి అందించాల్సి ఉంటుంది.(చదవండి: కాసుల వర్షం కురిపిస్తున్న బిగ్‌బాస్ షో...!)
కానీ, మీరు ఉద్యోగం చేయకపోయిన(విద్యార్థి, రిటైర్డ్ వ్యక్తి లేదా గృహిణి) ఇప్పటికీ క్రెడిట్ కార్డు లేకపోతే కొత్త కార్డు తీసుకోవచ్చని మీకు తెలుసా?. అవును, స్వయం ఉపాధి/నిరుద్యోగులు క్రెడిట్ కార్డు పొందడం అనేది కష్టంగా కావచ్చు కానీ అసాధ్యం కాదు. మీకు ఉద్యోగం లేకున్నా క్రెడిట్ కార్డును ఎలా పొందగలరో ఇప్పుడు తెలుసుకుందాం..
స్టాండర్డ్ క్రెడిట్ కార్డు: మీరు నిరుద్యోగి అయితే మ్యూచువల్ ఫండ్స్, ఫిక్సిడ్ డిపాజిట్, ప్రొఫెషనల్ ఫీజులు మొదలైన ఇతర వనరుల నుంచి మీ బ్యాంకు ఖాతాలో ప్రతి నెల స్థిరమైన ఆదాయం వస్తుంటే బ్యాంకులు, కార్డు కంపెనీలు అవసరమైన పత్రాలను ధృవీకరించిన తర్వాత క్రెడిట్ కార్డును జారీ చేసే అవకాశం ఉంది. రుణదాతలు ఎల్లప్పుడూ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లు చెక్ చేస్తాయి. అంటే, క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించే సామర్ధ్యం దరఖాస్తుదారుడికి ఉందా? లేదా? అనేది తనిఖీ చేస్తాయి.
యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు: ఒకవేల మీకు ఎటువంటి ఆదాయవనరు లేకపోతే, మీరు నిరుద్యోగి అయితే మీరు కూడా క్రెడిట్ కార్డు పొందే ఒక మార్గం ఉంది. మీ కుటుంబంలో ఎవరైనా ఇప్పటికే ఒక క్రెడిట్ కార్డును కలిగి ఉన్నట్లయితే మీరు యాడ్ ఆన్ లేదా సప్లిమెంటరీ క్రెడిట్ కార్డును పొందవచ్చు. ఇది ముఖ్యంగా విద్యార్థులు, గృహిణులకు ఉపయోగకరంగా ఉంటుంది. యాడ్ ఆన్ కార్డు అనేది ప్రాథమిక క్రెడిట్ కార్డు(ప్రామాణిక లేదా సురక్షితమైన క్రెడిట్ కార్డు) కింద జారీ చేసిన మరో అదనపు కార్డు.
సాధారణంగా ప్రాథమిక కార్డుహోల్డర్ తన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇది ఇవ్వవచ్చు. ఈ సందర్భంలో మొత్తం క్రెడిట్ లిమిట్ అనేది ప్రైమరీ. యాడ్ ఆన్ కార్డ్ హోల్డర్ మధ్య పంచుతారు. రెండు కార్డులను ఉపయోగించి చేసిన అన్ని లావాదేవీలకు ఒకే కన్సాలిడేటెడ్ స్టేట్ మెంట్ ఇస్తారు.(చదవండి: ఈ 4 యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!)
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్: మీకు ఉద్యోగం లేకపోయిన, హామీదారుడు లేకున్నా మీరు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును పొందవచ్చు. దీని కోసం మీరు నిర్దిష్ట మొత్తంను బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డును తిరిగి చెల్లించలేకపోతే, మీ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి ఆ సొమ్ము రికవరీ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ అనేది సాధారణంగా డిపాజిట్ మొత్తంలో 80-90 శాతం వరకు ఉంటుంది.
ఉదాహరణకు.. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆక్వా గోల్డ్ క్రెడిట్ కార్డును పొందాలంటే మీరు బ్యాంకులో కనీసం రూ.25,000 ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలి. అదే ఎస్బీఐ ఉన్నతి క్రెడిట్ కార్డును పొందడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.25,000 లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్ డి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment