ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగా పాన్ కార్డ్ కూడా అతి ముఖ్యమైన పత్రాలలో ఇది ఒకటి. కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోలన్నా, పన్ను చెల్లింపుల కోసం, ఈపీఎఫ్ ఖాతా వంటి వాటికి పాన్ కార్డు తప్పనిసరి అయ్యింది. అందుకే ప్రతి ఒక్కరూ పాన్ కార్డు కలిగి ఉంటే ఎంతో మంచిది. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డులను జారీ చేస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో కూడా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొందరు మోసాగాళ్లు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని పాన్ కార్డ్ విషయంలో మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు.
మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్న పాన్-కార్డులతో పాటు ఇతరుల పాన్-కార్డులు నిజమైనవా? నకిలీవా? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎన్ఎస్‌డీఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూపొందించిన PAN QR Code Reader యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండాలి. ఈ యాప్‌తో నకిలీ పాన్ కార్డును ఈజీగా గుర్తించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
నకిలీ పాన్-కార్డు గుర్తించడం ఎలా..?
- మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో 12 మెగాపిక్సల్ గల కెమెరా ఉండాలి.
- ఇప్పుడు 'ప్లే స్టోర్'కు వెళ్లి, 'PAN QR Code Reader' సర్చ్ చేయండి.
- కేవలం ఎన్ఎస్‌డీఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డెవలప్ చేసిన PAN QR Code Reader యాప్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఇప్పుడు మీరు 'పాన్ క్యూఆర్ కోడ్ రీడర్' యాప్ ఓపెన్ చేయగానే కెమెరా వ్యూఫైండర్‌లో గ్రీన్ కలర్ ప్లస్ లాంటి గ్రాఫిక్ కనిపిస్తుంది.
- దానిని మీరు తనిఖీ చేయాలనుకుంటున్న పాన్ కార్డు మీద కెమెరాను పాయింట్ చేయండి.
- ప్లస్ లాంటి గ్రాఫిక్ పాన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ మధ్యలో ఉండేలా చూసుకోండి.
ప్లస్ లాంటి గ్రాఫిక్ గుర్తు పాన్ కార్డు మీద పెట్టగానే బీప్ లాంటి సౌండ్ రావడంతో పాటు మీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. మీరు ఇచ్చిన పాన్ కార్డు వివరాలు ఇప్పుడు కనిపిస్తాయి. మీ దగ్గర ఉన్న పాన్ కార్డు వివరాలు, మొబైల్‌లో చూపించిన వివరాలు ఒకే విధంగా కనిపిస్తే. మీ కార్డు ఒరిజినల్ అని అర్ధం. స్కాన్ చేసిన తర్వాత వచ్చిన వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి పాన్ కార్డ్ కరెక్షన్ కోసం దరఖాస్తు చేయాలి.
(చదవండి: మొబిక్విక్ సిస్టమ్స్, స్పైస్ మనీపై ఆర్బీఐ భారీ జరిమానా)
Comments
Please login to add a commentAdd a comment