బీఎస్‌ఈలో జరిగిన వికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో నిర్మలా సీతారామన్, ఎక్సే్ఛంజీ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి తదితరులు
రిటైల్ ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి హెచ్చరిక
ముంబై: రిస్క్ లతో కూడుకున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యంలో దీనిపై తగిన విధంగా పర్యవేక్షణ ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో భవిష్యత్తులో మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్ల సెంటిమెంటు, కుటుంబాల పొదుపునకు సవాళ్లు తలెత్తగలవని ఆమె హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఆ నిధులకు రక్షణ కల్పించడం తమ లక్ష్యమని బీఎస్‌ఈ నిర్వహించిన వికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్ కారణంగా ప్రతి పది మంది రిటైల్ ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారన్న సెబీ అధ్యయనం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment